రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు కలిదిండి, మండవల్లి విద్యార్థుల ఎంపిక
ABN , First Publish Date - 2023-09-21T23:54:39+05:30 IST
రాష్ట్రస్థాయి అండర్–17, అండర్–14 వాలీబాల్ పోటీలకు తమ పాఠశాల విద్యార్థి నులు ఎంపికయ్యారని కలిదిండి జడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం స్వర్ణకుమారి తెలి పారు.
కలిదిండి/మండవల్లి, సెప్టెంబరు 21 : రాష్ట్రస్థాయి అండర్–17, అండర్–14 వాలీబాల్ పోటీలకు తమ పాఠశాల విద్యార్థి నులు ఎంపికయ్యారని కలిదిండి జడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం స్వర్ణకుమారి తెలి పారు. అండర్–17 విభాగంలో కె.శృతి, అండర్–14 విభాగంలో ఎన్.హర్షవర్థిని గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 20న నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చినట్టు చెప్పారు. విద్యార్థినులను పీడీలు కృష్ణకుమారి, మావుళ్లేశ్వరరావు, విద్యా కమిటీ ఛైర్మన్ తున్నీసా అభినందించారు. బాస్క రరావుపేట జడ్పీ హైస్కూల్‌కు చెందిన నలుగురు విద్యార్థినిలు రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయు లు కె.పాండురంగారావు తెలిపారు. అండర్–14 విభాగంలో సుధా ధనలక్ష్మి, అండర్–17 విభాగంలో జె.ప్రసన్న, పి.మౌనిక, చరిష్మ ఎంపికయ్యారన్నారు. విద్యార్థినులను పీడీ రవిబాబు, ఉపాధ్యాయులు అభినందదించారు.
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు అండర్–17 బాలుర విభాగంలో మండవల్లి మండలం చింతపాడు జిల్లా పరిషత్ హైస్కూల్‌కు చెందిన ఇద్దరు విద్యార్ధులు ఎంపికైనట్లు హెచ్‌ఎం కెఎస్‌ఎస్ ఆంజనేయులు తెలిపారు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఎం. భానుచరణ్, జే. మంజూ భగవాన్ ఎంపికయ్యారన్నారు.