అండర్–14, 17 రాష్ట్రస్థాయి క్రీడాజట్ల ఎంపిక
ABN , First Publish Date - 2023-09-22T00:07:56+05:30 IST
ఉమ్మడి పశ్చిమ జిల్లా పరిధిలో జరిగిన అండర్–14, 17 ఏళ్ల విభాగం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) క్రీడాపోటీల్లో మెరుగైన ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లకు ఎంపిక చేశామని ఎస్‌జీఎఫ్ కార్యదర్శి కె.జయరాజు తెలిపారు.
పెదవేగి, సెప్టెంబరు 21 : ఉమ్మడి పశ్చిమ జిల్లా పరిధిలో జరిగిన అండర్–14, 17 ఏళ్ల విభాగం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) క్రీడాపోటీల్లో మెరుగైన ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లకు ఎంపిక చేశామని ఎస్‌జీఎఫ్ కార్యదర్శి కె.జయరాజు తెలిపారు. పెదవేగిలో ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో అండర్–14, 17 ఏళ్ల విభాగాల బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్ క్రీడాజట్ల ఎంపిక పోటీలు గురువారం నిర్వహించారు.
ఎంపికైన క్రీడాకారులు..
17 ఏళ్ల విభాగం : మహేష్, హనీష్, యశ్వంత్, బెన్నీ, రాహుల్, అశ్విన్, కార్తీక్, పవన్, ప్రతీక్(పెదవేగి), చరణ్‌తేజ, మణికంఠ(గుండుగొలను), భార్గవ్(ఎల్‌బీ.చర్ల), సందీప్(శశి తణుకు), చందు(అత్తిలి).
14 ఏళ్ల విభాగం :మహిధర్, జస్వంత్, రాజా, గౌతమ్, మూర్తి, ప్రభాస్ (పెదవేగి), జయసాయి (లంకలకోడేరు), చైతన్య (గుండుగొలను), రాజు(జీలకర్రగూడెం), దీక్షిత్(అత్తిలి), రవీంద్ర (కేతవరం), నాగసాయి(ఆడమిల్లి), శివచందు(గోకవరం), ప్రదీప్(ఎల్‌బీ.చర్ల), పూర్ణ, మణికంఠ(తడికలపూడి), పవన్‌కి శోర్, సాయి రాకేష్, గోపి(కొయ్యలగూడెం), సాత్విక్(ఆరుగొలను). ఎంపికైన క్రీడాకారులు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఉమ్మడి జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శులు రాజేంద్రప్రసాద్, మల్లేశ్వరరావు తెలిపారు. గురుకుల విద్యాలయం వైస్ ప్రిన్సిపాల్ ఆదినారాయణ, పీఈటీలు పాల్గొన్నారు.