రూ.4 వేల కోసం కత్తిపోటు

ABN , First Publish Date - 2023-09-26T00:56:54+05:30 IST

నాలుగు వేల రూపాయల కోసం జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి కత్తి పోటుకు గుర య్యాడు. ఎస్‌ఐ ఎన్‌.చంటిబాబు తెలిపిన వివరాలివి..

రూ.4 వేల కోసం కత్తిపోటు

ఆగిరిపల్లి, సెప్టెంబరు 25 : నాలుగు వేల రూపాయల కోసం జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి కత్తి పోటుకు గుర య్యాడు. ఎస్‌ఐ ఎన్‌.చంటిబాబు తెలిపిన వివరాలివి.. ఆగిరి పల్లి మండలం ఈదర గ్రామంలో గురిజలా ఏసుదాసు (30), దేవరపల్లి మోషేలు అక్కాచెల్లెళ్ల పిల్లలు. ఆదివారం రాత్రి బాగా మద్యం తాగి ఆ మత్తులో రూ.4 వేల కోసం ఘర్షణ పడ్డారు. మోషే కత్తితో ఏసుదాసు పొట్టలో పొడిచాడు. తీవ్ర గాయం కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ సిబ్బందితో వెళ్లి బాధితుడిని 108లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-09-26T00:56:54+05:30 IST