Share News

గోవిందా.. గోవిందా..

ABN , Publish Date - Dec 17 , 2023 | 12:07 AM

శ్రీవారి ఆలయం శనివారం భక్తజన సందోహంగా మారింది. స్వామికి ఇష్టమైన రోజు కావడంతో భక్తులు వేలాదిగా వచ్చి మొక్కుబడులు తీర్చుకున్నారు.

గోవిందా.. గోవిందా..
శ్రీవారి ఆలయప్రాంగణంలో భక్తులు

వెంకన్న క్షేత్రంలో భక్తుల రద్దీ

ద్వారకాతిరుమల, డిసెంబరు 16: శ్రీవారి ఆలయం శనివారం భక్తజన సందోహంగా మారింది. స్వామికి ఇష్టమైన రోజు కావడంతో భక్తులు వేలాదిగా వచ్చి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని అన్ని విభాగాలు భక్తులతో కిక్కిరిశాయి. మొక్కుబడుల తరువాత భక్తులు శ్రీవారు, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. దాదాపు 15 వేల మందికి పైబడి భక్తులు శ్రీవారిని దర్శించినట్టు ఆలయ వర్గాలు భావిస్తు న్నాయి. దర్శనం అనంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. స్వామివారి ఉచిత దర్శనానికి దాదాపు మూడు గంటల సమయం పట్టింది.

నేత్రపర్వం.. ధ్వజారోహణం

శ్రీవారి క్షేత్ర దత్తత దేవాలయమైన వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్య కల్యాణ మహోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో అంకురార్పణ, ఽఽఽఽఽఽఽఽధ్వజారోహణ, అగ్నిప్రతిష్టాపన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. హోమాది క్రతువును నిర్వహించారు. వేదమంత్రోచ్చరణల నడుమ ధ్వజపటంపై నెమలి చిత్రాన్ని వేసి హారతులిచ్చారు అనంతరం ఆలయంపై ఎగుర వేసి ధ్వజారోహణను జరిపారు.

శ్రీవారి గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు

క్షేత్రంలో ఈనెల 23న జరుగనున్న ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ముందురోజు జరిగే గిరి ప్రదిక్షిణకు ఏర్పాట్లను ఈవో వి.త్రినాథరావు, ఈఈ భాస్కర్‌, సిబ్బందితో కలసి శనివారం పరిశీలించారు. భక్తులు నడిచేందుకు వీలుగా ఈ రహదారిని తయారు చేయాలని సిబ్బందికి ఆదేశిస్తూ.. సూచనలు, సలహాలు అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం 2–30 గంటల నుంచి గిరి ప్రదక్షిణ ఆలయ తొలిమెట్టు ప్రాంతం నుంచి ప్రారంభం కానుంది. గోవింద స్వాములు, భజన, కోలాట బృందాలు, అశ్వ, గజ సేవలనడుమ అట్టహాసంగా జరిపేవిదంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యాత్ర దొరసానిపాడు, రాళ్లకుంట, ద్వారకాతిరుమల ఉగాది మండపం నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల మేర జరిగి చూపరులను అలరించనుంది.

Updated Date - Dec 17 , 2023 | 12:07 AM