స్పోర్టింగ్‌ క్లబ్‌ అధ్యక్షుడు కొండలరావు మృతి

ABN , First Publish Date - 2023-03-15T00:08:43+05:30 IST

నూజివీడు స్పోర్టింగ్‌ క్లబ్‌ అధ్యక్షుడు, నూజివీడు ప్రముఖుడు బొబ్బిలి కొండలరావు (88) మంగళవారం ఉదయం విజయవాడలో చికిత్స పొందు తూ మృతి చెందారు

స్పోర్టింగ్‌ క్లబ్‌ అధ్యక్షుడు  కొండలరావు మృతి
బొబ్బిలి కొండలరావు (ఫైల్‌ ఫొటో)

నూజివీడు టౌన్‌, మార్చి 14: నూజివీడు స్పోర్టింగ్‌ క్లబ్‌ అధ్యక్షుడు, నూజివీడు ప్రముఖుడు బొబ్బిలి కొండలరావు (88) మంగళవారం ఉదయం విజయవాడలో చికిత్స పొందు తూ మృతి చెందారు. ఈయన ఏయూ మాజీ వీసీ ఎమ్మార్‌ అప్పారావు అనుచరుడు. ప్రస్తుత నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్‌ అప్పారావుకు సన్నిహితులు. నూజివీడు డీఏఆర్‌ కళాశాల కార్యదర్శిగా 40 ఏళ్లు, బాస్కెట్‌బాల్‌ అసోసియేష న్‌ కార్యదర్శిగా 20 ఏళ్లు సేవలందించారు. నూజివీడు మున్సిపాల్టీ కాక ముందు పంచాయతీ బోర్డు మెంబర్‌గా పనిచేసి నూజివీడు రాజకీయాల్లో తనదైన పాత్రను పోషించారు. కొద్దికాలంగా అనారోగ్యంతో ఉన్న ఈయన విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు. ఈయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొండలరావు మృతికి నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్‌ అప్పారావు, నూజివీడు టీడీపీ ఇన్‌చార్జ్‌ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, పలువురు నూజివీడు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Updated Date - 2023-03-15T00:08:43+05:30 IST