త్వరితగతిన కేసుల దర్యాప్తు

ABN , First Publish Date - 2023-05-31T23:55:06+05:30 IST

కేసులను త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి నిందితులను అరెస్టు చేసి ఛార్జిషీట్లను కోర్టులో దాఖలు చేయాలని ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశించారు.

 త్వరితగతిన కేసుల దర్యాప్తు

ఏలూరు క్రైం, మే 31 : కేసులను త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి నిందితులను అరెస్టు చేసి ఛార్జిషీట్లను కోర్టులో దాఖలు చేయాలని ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశించారు. జిల్లాలోని డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలతో బుధవారం వీడియో కాన్పరెన్సును ఏలూరు పోలీస్‌ కార్యాలయం నుంచి నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్‌ ట్రైల్స్‌లో ఉన్న కేసులలో ముద్దాయిలను కోర్టుకు హాజరయ్యేలా చూడాలని, పెండింగ్‌ నాన్‌బెయిలబుల్‌ వారెంట్లను అమలు చేయాలని, సాక్షులను సకాలంలో కోర్టులో హాజరు పరిచి సంబంధిత కేసులో సాక్షుల చేత సాక్ష్యం ఇప్పించేలా ఎపీపీల వద్ద హాజరుపర్చాలని సూచించారు. ముద్దాయిలకు శిక్ష పడడం వల్ల నేరం చేయాలంటే నేరస్తుల్లో భయం కలగాలన్నారు. ఉద్యోగ నిర్వహణలో అధికారులు అలసత్వం ప్రదర్శించరాద న్నారు. పలు కేసుల్లో తగిన సూచనలు, సలహాలు, ఆదేశాలు ఎస్పీ జారీ చేశారు. ఈ వీసీలో స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం. సుబ్బారావు, బీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ దుర్గా ప్రసాద్‌, ఎస్‌ఐ సాధిక్‌లు పాల్గొన్నారు.

––––––––––––––––––––––––

Updated Date - 2023-05-31T23:55:06+05:30 IST