ఎస్పీ స్పందనలో 22 ఫిర్యాదులు
ABN , First Publish Date - 2023-09-26T00:21:22+05:30 IST
భీమవరం సబ్ డివిజనల్ కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో 22 ఫిర్యాదులు అంది నట్లు ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు.

భీమవరం క్రైం, సెప్టెంబరు 25 : భీమవరం సబ్ డివిజనల్ కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో 22 ఫిర్యాదులు అంది నట్లు ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు.జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు సివిల్ తగాదాలు, భార్యభర్తల గొడవలు వంటివాటిపై ఫిర్యాదు చేశారు. వినతులు పరిశీలించిన ఎస్పీ సంబంధిత సమస్యలు పరిష్కారం చేయాలంటూ ఆదే శాలు జారీ చేశారు. జిల్లా అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు పాల్గొన్నారు.