Share News

సౌత్‌జోన్‌ క్రీడాపోటీలకు సెయింట్‌ జోసెఫ్‌ దంత వైద్య విద్యార్థులు

ABN , Publish Date - Dec 17 , 2023 | 12:08 AM

దుగ్గిరాలలో సెయింట్‌ జోసెఫ్‌ దంతవైద్య విద్యార్థులు సౌత్‌జోన్‌ క్రీడాపోటీలకు ఎంపికయ్యారని కళాశాల కరస్పాండెంట్‌ ఫాదర్‌ జి.మోజెస్‌ తెలిపారు.

సౌత్‌జోన్‌ క్రీడాపోటీలకు సెయింట్‌ జోసెఫ్‌ దంత వైద్య విద్యార్థులు
ఫుట్‌బాల్‌ క్రీడాకారులతో కరస్పాండెంట్‌ ఫాదర్‌ మోజెస్‌

పెదవేగి, డిసెంబరు 16 : దుగ్గిరాలలో సెయింట్‌ జోసెఫ్‌ దంతవైద్య విద్యార్థులు సౌత్‌జోన్‌ క్రీడాపోటీలకు ఎంపికయ్యారని కళాశాల కరస్పాండెంట్‌ ఫాదర్‌ జి.మోజెస్‌ తెలిపారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఆధ్యరంలో డాక్టర్‌ ఈ.త్రిమూర్తి సారథ్యంలో దుగ్గిరాల సెయింట్‌ జోసెఫ్‌ దంతవైద్య కళాశాలలో శనివారం ఫుట్‌బాల్‌ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సెయుంట్‌ జోసెఫ్‌ దంతవైద్య కళాశాల విద్యార్థులతోపాటు పిన్నమనేని సిద్ధార్థ కళాశాల, సెయింట్‌ జోసెఫ్‌ నర్శింగ్‌ కళాశాల, విశాఖపట్నంలోని ఎన్నారై కళాశాల, ఏసీఎస్‌ఆర్‌, సిద్ధార్ధ, నారాయణ, జీఎస్‌ఎల్‌, ఆంధ్రా మెడికల్‌ కాలేజీల విద్యార్థులు సౌత్‌జోన్‌ ఫుట్‌బాల్‌ పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఎంపికైన విద్యార్థులు తమిళనాడు రాష్ట్రం చెన్నై నగరంలోని ఎస్‌ఎంఆర్‌ విశ్వవిద్యాలయంలో ఈనెల 25వ తేదీన జరిగే సౌత్‌జోన్‌ ఫుట్‌బాల్‌ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ ఎంపిక పోటీల్లో ఏపీ స్పోర్ట్స్‌ అథారిటీ ఫుట్‌బాల్‌ కోచ్‌ సిరాజుద్దీన్‌, రాష్ట్రంలోని పలు కళాశాలల పీడీలు జె.సెల్వీబాబు, శ్రీనివాసరాజు, గురునాఽథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 12:09 AM