నేత్రపర్వం శోభనాచలుని కల్యాణం
ABN , First Publish Date - 2023-01-29T00:51:20+05:30 IST
రథసప్తమి సందర్భంగా శనివారం ఆగిరిపల్లిలోని శోభనగిరికి భక్తులు పోటెత్తారు.
ఆగిరిపల్లి : రథసప్తమి సందర్భంగా శనివారం ఆగిరిపల్లిలోని శోభనగిరికి భక్తులు పోటెత్తారు. మెట్లమార్గంలో మహిళలు పూజలు చేశారు. శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. వట్టిగుడిపాడుకు చెందిన చింతపట్ల వెంకట సత్యనారా యణరావు దంపతులు స్వామి శాంతి కల్యాణం జరిపించారు. సాయంత్రం స్వామి వారిని తిరుచ్చి వాహనంలో ఆలయం నుంచి గ్రామోత్సవంగా కల్యాణ మండపానికి తరలించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే ప్రతాప అప్పారావు, ఆలయ ఈవో ఎన్.భవాని ఆలయం వద్ద భారీ అన్నసంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎస్‌ఐ ఎన్.చంటిబాబు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.