నిడమర్రుకు ఎస్‌ఐ కావలెను
ABN , First Publish Date - 2023-04-13T00:05:56+05:30 IST
కొల్లేటి తీర ప్రాంతంలోని నిడమర్రు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ మూడు నెలల క్రితం బదిలీ అయ్యారు.
కేవలం ఆరుగురే కానిస్టేబుల్స్ ఇదీ స్టేషన్ పరిస్థితి
నిడమర్రు, ఏప్రిల్ 12: కొల్లేటి తీర ప్రాంతంలోని నిడమర్రు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ మూడు నెలల క్రితం బదిలీ అయ్యారు. అప్పటి నుంచి గణపవరం ఎస్‌ఐ ఇక్కడ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. గణపవరం మండలం ఏలూరు జిల్లా నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో విలీనమైంది. ఆ జిల్లాలోని ఎస్‌ఐ ఏలూరు జిల్లా నిడమర్రుకు ఇన్‌చార్జిగా వ్యవహరించడం గమనార్హం. నిడమర్రు పోలీస్‌స్టేషన్ నిర్వహణను ఉన్నతాధికారులు పూర్తిగా గాలికొ దిలేశారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఎస్‌ఐ మాత్రమే కాదు, సి బ్బంది కూడా లేరు. స్టేషన్‌లో 21 మంది కానిష్టేబుల్స్ ఉండాలికి కాని ప్రస్తుతం ఆరుగురు మాత్రమే పనిచేస్తున్నారు. 4 హెడ్ కానిష్టేబుల్స్, 2 ఏఎస్‌ఐ పోస్టులు, ఎస్‌ఐ పోస్టు ఖాళీ. కేవలం ఆరుగురు కానిస్టేబుల్స్‌తో పోలీస్ స్టేషన్ మాత్రం ఎందుకని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నెలల తరబడి సిబ్బంది లేకపోయినా, పొరుగు జిల్లా ఎస్‌ఐ ఇన్‌చార్జిగా కొనసా గుతున్న స్టేషన్ ఉన్నట్టా లేనట్టా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉన్నవా రిలో ఒకరిద్దరు పదో తరగతి పరీక్షల బందోబస్తులో ఉన్నారు.
మండలంలో 17 గ్రామాల శాంతిభద్రతల పర్యవేక్షణకు కేవలం ఆరు గురు మాత్రమే కానిస్టేబుల్స్ ఉంటే ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకు న్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. స్టేషన్ పరిధిలోని కొల్లేరు తీర ప్రాంత గ్రామాలైన తోకలపల్లి, పత్తేపురం, పెదనిండ్రకొలను, నిడమర్రు, అడవికొ లను, ఛానమిల్లి, బావాయిపాలెం, క్రొవ్విడిలో చేపలు, రొయ్యల సాగు విస్తీ ర్ణం అధికం. ఆయా గ్రామాల్లో పేకాట స్థావరాలు కూడా ఎక్కువే. పేకాట స్ధావరాల నిర్వహణపై ఆరోపణల నేపథ్యంలో గతంతో ఒక ఎస్‌ఐ సస్పెండ్ కావడం ఈ ప్రాంతంలో పేకాట జోరుకు అద్దం పడుతుంది. ఈ స్టేషన్‌లో నేరాల రికార్డు పరిశీలిస్తే అధిక శాతం పేకాట, కోడిపందేల కేసులే ఉంటా యని స్థానికులు చెబుతారు. ప్రస్తుతం స్టేషన్‌లో అధికారి, సిబ్బంది లేకపో వడం, ఉన్న ఆరుగురిలో పదో తరగతి పరీక్షల బందోబస్తు, కోర్టు విధులకు వెళ్లాల్సి ఉండడం పేకాట నిర్వాహకులకు పండగేనని పలువురు బహిరం గంగా వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు మండల ప్రజలను వేసవి దొంగత నాల భయం వెన్నాడుతోంది. స్టేషన్‌లో ఎస్‌ఐతో పాటు పూర్తిస్థాయి సిబ్బం దిని నియమించాలని పలువురు కోరుతున్నారు.