రిజిస్ర్టేషన్‌లకు బ్రేక్
ABN , First Publish Date - 2023-12-01T23:55:09+05:30 IST
జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రిజిస్ర్టేషన్‌లు నిలచిపోయాయి. ఆచంటలో రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన కక్షిదారులు కార్యాలయం వద్ద పడిగాపులు పడి చివరకు సర్వర్ పని చేయకపోవడంతో వెళ్లిపోయారు. ఆకివీడు సబ్–రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈకేవైసీ, సర్వర్లు పనిచేయక రిజిస్ట్రేషన్లు నిలిచాయి.
కార్యాలయాల్లో ఈకేవైసీ ఇబ్బందులు
గంటల తరబడి మొరాయించిన సర్వర్
పడిపోతున్న ఆదాయం
(భీమవరం–ఆంధ్రజ్యోతి/ ఆచంట/ ఆకివీడు, డిసెంబరు 1 :రిజిస్ర్టేషన్‌లకు సాంకేతిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. సర్వర్ సమస్యలతో రిజిస్ర్టేషన్‌లు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న 2.0 విధానంలోనూ అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉంటే జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రిజిస్ర్టేషన్‌లు నిలచిపోయాయి. ఆచంటలో రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన కక్షిదారులు కార్యాలయం వద్ద పడిగాపులు పడి చివరకు సర్వర్ పని చేయకపోవడంతో వెళ్లిపోయారు. ఆకివీడు సబ్–రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈకేవైసీ, సర్వర్లు పనిచేయక రిజిస్ట్రేషన్లు నిలిచాయి. శుక్రవారం రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం లేదని అధికారులు తేల్చి చెప్పడంతో నిరాశతో వెను తిరిగారు. ఏలూరు జిల్లాలోని కార్యాల యాల్లోనూ ఇదే పరిస్థితి వెంటాడింది. ఆధార్‌తో ఈకెవైసీ చేయడానికి అప సోపాలు పడ్డారు. జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లోనూ ఈ సమస్య ఎదురైంది. మధ్యాహ్నం 12 గంటల వరకు సజావుగా రిజిస్ర్టేషన్‌లు నిర్వహిం చారు. ఆ తర్వాత ఈకెవైసీ సమస్య వెంటాడింది. సాయంత్రం ఆరు గంటల వరకు రిజిస్ర్టేషన్‌లు నిలచిపోయాయి. తర్వాత సాంకేతిక ఇబ్బందులు తొల గాయి. దాంతో రాత్రి కూడా రిజిస్ర్టేషన్ ప్రక్రియ కొనసాగించారు. జిల్లాలో భీమవరం, సజ్జాపురం, తాడేపల్లిగూడెం, తణుకులో అత్యధికంగా దస్తావేజులు నమోదవుతుంటాయి. ఇటీవల సాంకేతిక సమస్యలతో దస్తావేజులు తగ్గిపోతు న్నాయి. దాంతో ఆదాయం పడిపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని చేరుకోవడం గగనంగా మారింది. గత ఏడాది సమకూరిన ఆదాయం కూడా రావడం లేదంటూ సబ్ రిజిస్ర్టార్‌లు గగ్గోలు పెడుతున్నారు. లక్ష్యాన్ని చేరుకోవా లంటూ ప్రభుత్వం ఒత్తిడి పెడుతోంది.అయితే రియల్ ఎస్టేట్ పతనం కావడంతో రిజిస్ర్టేషన్‌లు పెద్దగా ఉండడం లేదు.దానికితోడు ప్రభుత్వం ఎప్పటి కప్పుడు అమలు చేస్తున్న విధానాలు కూడా అవరోధాలుగా మారాయి.
పడిపోయిన ధరలు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు పూర్తిగా పతనమయ్యాయి. పంట పొలాల ధరలు తగ్గిపో యాయి. క్రయ విక్రయాలు పడిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వంలో నిర్మాణాలు చేపట్టకూడదంటూ రియల్టర్‌లు ఇతర రాష్ర్టాలకు తరలిపోతున్నారు. ఇవన్నీ రిజి స్ర్టేషన్‌లపై ప్రభావం చూపుతున్నాయి.