మధ్యాహ్న భోజన వర్కర్ల ధర్నా

ABN , First Publish Date - 2023-02-21T23:31:18+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో 20 ఏళ్లుగా పనిచేస్తున్న వారికి రోజుకు రూ.వంద ఇచ్చి వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని ఏఐటీయూసీ జిల్లా నాయకుడు బుచ్చిబాబు అన్నారు.

మధ్యాహ్న భోజన వర్కర్ల ధర్నా
ఎంఈవో కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన వర్కర్ల ధర్నా

చింతలపూడి, ఫిబ్రవరి 21: ప్రభుత్వ పాఠశాలల్లో 20 ఏళ్లుగా పనిచేస్తున్న వారికి రోజుకు రూ.వంద ఇచ్చి వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని ఏఐటీయూసీ జిల్లా నాయకుడు బుచ్చిబాబు అన్నారు. మండల విద్యా వనరుల కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన పథకం కార్మికులు మంగళవారం ధర్నా నిర్వహించారు. వంటకు సరిపడా గ్యాస్‌ ఇవ్వడం లేదన్నారు. మెనూ మాత్రం పెంచి చార్జీ తక్కువ ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారన్నారు. ప్రతీ విద్యార్థికి రూ.20 చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నెల జీతం రూ.10 వేలు ఇవ్వాలన్నారు. ధర్నాలో షేక్‌ పకీరమ్మ, బి.మరి యమ్మ, కె.కుమారి, వెంకమ్మ తదితరులు నాయకత్వం వహించారు.

Updated Date - 2023-02-21T23:31:21+05:30 IST