విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధికి సవిస్కార దోహదం

ABN , First Publish Date - 2023-03-26T00:36:24+05:30 IST

విద్యార్థుల్లో కమ్యూనికేషన్‌, ఆర్గనైజింగ్‌, డెషిషన్‌ మేకింగ్‌ స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌కు సవి స్కార వంటి కార్యక్రమాలు దోహదపడతాయని రిజిస్ట్రార్‌ ఆచార్య టి.అశోక్‌ అన్నారు.

విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధికి సవిస్కార దోహదం
మాట్లాడుతున్న రిజిస్ట్రార్‌ అశోక్‌

రాజమహేంద్రవరం, మార్చి 25: విద్యార్థుల్లో కమ్యూనికేషన్‌, ఆర్గనైజింగ్‌, డెషిషన్‌ మేకింగ్‌ స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌కు సవి స్కార వంటి కార్యక్రమాలు దోహదపడతాయని రిజిస్ట్రార్‌ ఆచార్య టి.అశోక్‌ అన్నారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం కామర్స్‌ అండ్‌ మేనేజ్మెంట్‌ విభాగం ఆధ్వర్యంలో సవిస్కార– 2కె23ని శనివారం ఘనంగా నిర్వహించారు. దీనిని రిజిస్ట్రార్‌ అశోక్‌ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తూ మేనేజ్మెంట్‌ స్కిల్స్‌ వృద్ధి చేయడా నికి, నూతన ఆలోచనల ప్రేరణకు సవిస్కార చక్కని వేదిక అని అన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని ఆయా కళాశాలల మేనేజ్మెంట్‌ విద్యార్థులు హాజరై విజయవంతం చేశారన్నారు.

అనంతరం విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. వర్సిటీ మేనేజ్మెంట్‌ విద్యార్థులు నిర్వహించిన ఫాస్ట్‌మాబ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సర్టిఫికెట్లు, పతకాలు అందజేశారు. ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ ఎన్‌.ఉదయభాస్కర్‌, ఆంధ్రా పేపర్‌ మిల్లు జీఎం చక్రపాణి, చార్టెడ్‌ అకౌంటెంట్‌ బి.బ్రహ్మానందం, ప్రిన్సిపాల్‌ ఆచార్య ఎస్‌.టేకి, అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T00:36:24+05:30 IST