Share News

అశ్రునయనాల మధ్య సాబ్జీ అంతిమయాత్ర

ABN , Publish Date - Dec 17 , 2023 | 11:47 PM

ఉద్యోగ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ అంత్యక్రియలు పూర్తయ్యాయి.

అశ్రునయనాల మధ్య సాబ్జీ అంతిమయాత్ర
ఎమ్మెల్సీ సాబ్జీ మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, వెంకటేశ్వరరావు

ఏలూరుటూటౌన్‌, డిసెంబరు 17: ఉద్యోగ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు దగ్గర ఈనెల 15న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆదివారం ఆశ్రం ఆసుపత్రి నుంచి పార్ధీవదేహాన్ని తీసుకొచ్చి ఇండోర్‌ స్టేడియంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం వంగాయగూడెం శ్మశానవాటికలో మధ్యాహ్నం అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇండోర్‌ స్టేడియంలో పలువురు ప్రముఖులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, ఎంపీ కోటగిరి శ్రీధర్‌, మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌, ఎస్‌ఎంఆర్‌ పెదబాబు, ఎమ్మెల్సీలు కె.లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వ రరావు, వి.బాలసుబ్రహ్మణ్యం, జనసేన నాయకులు రెడ్డిఅప్పల నాయుడు నివాళులర్పించారు. కలెక్టర్‌ ప్రసన్నవెంకటేశ్‌, జేసీ లావణ్యదేవి, ఎస్పీ మేరీ ప్రశాంతి, ఆర్‌డీవో, ఎమ్మార్వోలు, జిల్లా ఉన్నతాధికారులు నివాళులర్పించారు.

ఫసీపీఎం రాష్ట్ర నాయకులు మంతెన సీతారామ్‌, వై.వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఎ.రవి, కిషోర్‌, డీఎన్‌వీడీ ప్రసాద్‌లు నివాళులర్పించారు.

ఫ తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయ కార్యదర్శి పాలి ప్రసాద్‌ సాబ్జీ భౌతికదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. నగరంలోని పలువురు పురప్రముఖులు, వ్యాపారస్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు నివాళులర్పించారు.

అంతిమ యాత్ర

ఇండోర్‌ స్టేడియం నుంచి యూటీఎఫ్‌ భవన్‌కు తీసుకొచ్చి అక్కడ కొద్ది సేపు పార్థీవదేహాన్ని ఉంచారు. అక్కడ నుంచి సత్రంపాడులోని సాబ్జీ నివాసానికి భౌతిక కాయాన్ని తరలించారు. ప్రజల సందర్శానార్థం కొంత సేపు ఉంచి అనంతరం అంతిమయాత్ర మొదలైంది. కొత్తబస్టాండ్‌, ఫైర్‌స్టేషన్‌, జూట్‌మిల్లు మీదుగా వంగాయిగూడెంలోని మసీదు వద్ద అంత్యక్రియలు నిర్వహించారు. దారి పొడవునా వేలాది మంది అంతిమ యాత్రలో పాల్గొన్నారు.

ఓపీఎస్‌ సాధించడమే సాబ్జీకి నివాళి

సంతాప సభలో పలువురు వక్తలు

ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 17:ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజాఉద్యమాలతో ప్రభుత్వాలను, పాలకులను గడగడలాడించిన పోరాటయోథుడిగా షేక్‌ సాబ్జీ అందరి హృదయాల్లో చిరస్మరణీయుడిగా ఉంటారని పలువురు వక్తలు నివాళులర్పించారు. సాబ్జీ దుర్మరణానికి చింతిస్తూ ఆదివారం ఏలూరులోని యూటీఎఫ్‌ జిల్లా కార్యాలయంలో సంతాపసభ నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలనుంచి యూటీఎఫ్‌ నాయకులతోపాటు, పలు సంఘాల రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్షణరావు మాట్లాడుతూ నిబద్దత, నిస్వార్థంతో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాటతత్వాన్ని ముందుకుతీసుకెళ్లడంలో ఆదర్శనీ యంగా నిలిచారని కొనియాడారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కీలకమైన సీపీఎస్‌ ఉద్యమాన్ని రాష్ట్రవాప్తం చేసి ఓపీఎస్‌ను సాధించడమే సాబ్జీకి నిజమైన నివాళులు అన్నారు. యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.వెంకటేశ్వర్లు, కె.ఎస్‌.ఎస్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ ఎటువంటి సమస్యనైనా ముందుగా విశ్లేషించిన తర్వాతే ఆ సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనేందుకు ముందుకు వెళ్ళేవారని గుర్తుచేసుకు న్నారు. సంతాప సభలో యూటీఎఫ్‌ తోపాటు, పలు సంఘాల నాయకులు కొమ్మోజు శ్రీనివాసరావు, కె.సురేష్‌కుమార్‌, బి.లక్ష్మీరాజా, ఎన్‌.అరుణకుమారి, మనోహర్‌కుమార్‌, గోపీమూర్తి, రవి, సుందరయ్య, బేబిరాణి, నంబూరి రాంబాబు, రవికుమార్‌, ముస్తఫాఅలీ, శ్యాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:54 PM