1,18,113 మందికి రైతు భరోసా
ABN , First Publish Date - 2023-06-02T00:10:43+05:30 IST
రైతుల కష్టాలకు శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి అన్నారు. గురువారం 2023–24 సంవత్సరానికి వైఎస్‌ఆర్ రైతు భరోసా–పీఎం కిసాన్ కింద ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి బటన్ నొక్కి నేరుగా అర్హులైన రైతుల ఖాతాల్లోకి జమ చేశారు.
భీమవరం, జూన్ 1 : రైతుల కష్టాలకు శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి అన్నారు. గురువారం 2023–24 సంవత్సరానికి వైఎస్‌ఆర్ రైతు భరోసా–పీఎం కిసాన్ కింద ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి బటన్ నొక్కి నేరుగా అర్హులైన రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. భీమవరం విష్ణు కాలేజీ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వర్చువల్‌గా వీక్షించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో 1,18,113 మంది రైతులకు వైఎస్‌ఆర్ రైతు భరోసా–పీఎం కిసాన్ పథకం ద్వారా 5వ సంవత్సరం మొదటి విడత కింద రూ.88.58 కోట్లు అందజేస్తామన్నారు. 2023 రబీ పంట కాలంలో అధిక వర్షాల వల్ల పంట నష్టపోయిన 304 మంది రైతులకు 23.54 లక్షల రూపాయలు అందజేశామన్నారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు కైగాల శ్రీనివాసరావు, సభ్యులు కొట్టి కుటుంబరావు, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి దుర్గేష్, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి మురళీకృష్ణ, ఏపీఎంఐడీ పీడీ వీరభద్రరావు, రైతులు పాల్గొన్నారు.