కదలని ఆర్టీ బస్సు
ABN , First Publish Date - 2023-02-23T23:51:09+05:30 IST
ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు అకస్మాత్తుగా మార్గమధ్యలో నిలిచిపోయింది.
ఏలూరు – చింతలపూడి ప్రయాణికుల అవస్థలు
పెదవేగి, ఫిబ్రవరి 23: ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు అకస్మాత్తుగా మార్గమధ్యలో నిలిచిపోయింది. మరమ్మతుకు గురైన బస్సు ఎంతకీ కదల్లేదు. ప్రయాణికులంతా నడిరోడ్డుపై నిలబడ్డారు.. రోడ్డు పక్కన కూలబడ్డారు. ఏలూరు డిపో నుంచి వేరొక బస్సు వచ్చే వరకు అదే పరిస్థితి. ఏలూరు నుంచి ప్రయాణికులతో గురువారం బస్సు చింతలపూడి వెళుతోంది. పెదవేగి మండలం వంగూరు పరిధిలో రంగరాజు వేర్‌హౌసింగ్ సమీపంలో చింతలపూడి రహదారిపై ఒక్కసారిగా బస్సు ఆగిపోయింది. ఎన్ని ప్రయ త్నాలు చేసినా బస్సు కదలకపోవడంతో ప్రయాణికులు కిందికి దిగి రహ దారి పక్కనే కూర్చుండిపోయారు. సమాచారం అందుకున్న ఏలూరు ఆర్టీసీ డిపో అధికారులు వేరొక బస్సును ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా వేరొక బస్సును ఏర్పాటుచేసి వారి గమ్యస్థానాలకు చేర్చామని ఏలూరు డిపో మేనేజర్ వాణి తెలిపారు.