రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పనిచేయాలి

ABN , First Publish Date - 2023-05-26T00:08:31+05:30 IST

రాష్ట్రంలో నరసాపురం నుంచి అశ్వారావుపేట వరకు, ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వరకు ఉన్న రహదారుల్లోనే అత్యం త ప్రమాదాలు జరుగుతున్నాయని అన్ని శాఖల సమన్వయంతో ప్రమదాల నివారణ కోసం చర్యలు చేపట్టినట్టు రోడ్డు భద్రత అథారిటీ చైౖర్మన్‌ కేఆర్‌ఎం కిషోర్‌కుమార్‌ అన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పనిచేయాలి
విలేకరులతో మాట్లాడుతున్న రోడ్డు భద్రతా అథారిటీ చైర్మన్‌ కిషోర్‌కుమార్‌

రోడ్డు భద్రతా అథారిటీ చైౖర్మన్‌ కిషోర్‌కుమార్‌

ఏలూరు క్రైం, మే 25 : రాష్ట్రంలో నరసాపురం నుంచి అశ్వారావుపేట వరకు, ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వరకు ఉన్న రహదారుల్లోనే అత్యం త ప్రమాదాలు జరుగుతున్నాయని అన్ని శాఖల సమన్వయంతో ప్రమదాల నివారణ కోసం చర్యలు చేపట్టినట్టు రోడ్డు భద్రత అథారిటీ చైౖర్మన్‌ కేఆర్‌ఎం కిషోర్‌కుమార్‌ అన్నారు. ఏలూరులోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డు భద్రత అందరి బాధ్యత అని దీనికోసం అన్ని ప్రభుత్వశాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచిం చారు. ముఖ్యంగా ప్రమాదాలను నివారించేందుకు భద్రతను పెంపొందిం చేందుకు విశాఖపట్నం నుంచి చెన్నై వరకు ఉన్న ఇండస్ట్రియల్‌ కారిడార్‌ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పరిశ్రమల శాఖ చేపట్టిన అధ్యయనంలో పలు అంశాలు గుర్తించారన్నారు. ఏదైనా అభివృద్ధి చెందాలంటే రోడ్డు మార్గం ముఖ్యమన్నారు. తొలుత హోటల్‌లో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఆర్‌అండ్‌బీ, పోలీసు, రవాణా, రెవెన్యూ, ఆరోగ్యశాఖ, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు. ముఖ్యఅతిఽథిగా విచ్చేసిన డీజీపీ కిషోర్‌కు మార్‌ మాట్లాడుతూ రోడ్డు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తు న్నామని ఉమ్మడి జిల్లాకు సంబంధించి ముందస్తు సహకారం అందిస్తామన్నారు. రాష్ట్ర రహదారులపై జరుగుతున్న ప్రమాదాలు, వాటి తీవ్రతను బట్టి 220 కిలో మీటర్ల మేర మూడు హైవేలను డెమో కారిడార్లుగా, మరో వెయ్యి కిలో మీటర్ల మేర 26 హైవేలను హజార్డ్స్‌ కారిడార్లుగా గుర్తించామన్నారు. పలు భద్రతా పరికరాలైన డ్రైవింగ్‌, పెట్రోలింగ్‌ వాహనాలు, లేజర్‌ గన్స్‌, బ్రీతింగ్‌ ఎన్‌లైజర్స్‌ తదితర సాధనాలు వినియోగంలోకి తీసుకువస్తామన్నారు. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ రోడ్డు భద్రతకు, ప్రమాదాల నివారణకు అవసరమైన ప్రతిపాదనలకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఎస్‌ఈ భాస్కరరావు, పరిశ్రమలశాఖ జేడీ గిరిధరరావు పలువురు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T00:08:31+05:30 IST