ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా..

ABN , First Publish Date - 2023-06-11T00:13:30+05:30 IST

దంపతు లిద్దరూ ఆసుపత్రికి మోటారుసైకిల్‌పై వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా వ్యాన్‌ ఢీకొని ఇద్దరూ మృతి చెందిన ఘటన దెందులూరు మండలం కొమిరేపల్లి హైవే వద్ద జరిగింది.

ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా..
ప్రమాదానికి గురైన వ్యాన్‌

వ్యాన్‌ ఢీకొని దంపతులు మృతి

ఏలూరు క్రైం/ దెందు లూరు, జూన్‌ 10 : దంపతు లిద్దరూ ఆసుపత్రికి మోటారుసైకిల్‌పై వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా వ్యాన్‌ ఢీకొని ఇద్దరూ మృతి చెందిన ఘటన దెందులూరు మండలం కొమిరేపల్లి హైవే వద్ద జరిగింది. దెందులూరు పోలీసులు తెలిపిన వివరాలివి.. కొమిరేపల్లికి చెందిన కాలి జార్జి (ప్రభాకరరావు)(63), భార్య రత్నకుమారి (55) కలిసి టీవీఎస్‌ మోపెడ్‌పై గుండుగొలనులో ఉన్న ఆసుపత్రికి శనివారం రాత్రి వెళ్లి తిరిగి వస్తుండగా కొమిరేపల్లి ఊరు వెళ్లే యూటర్న్‌ వద్ద మలుపు తిరుగుతుండగా ఏలూరు నుంచి భీమడోలు వైపు వస్తున్న ఓ వ్యాను అతి వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన ఇద్దరిని అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తీసుకువచ్చారు. అప్పటికే రత్నకుమారి మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. తీవ్ర గాయాలైన ప్రభాకరరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై వైద్యులు ఎమ్మెల్సీగా కేసు నమోదు చేసి ఆసుపత్రి ఔట్‌ పోస్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తొలుత ఆసుపత్రిలో చేరిన కాలి జార్జిని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పరామర్శించారు.

Updated Date - 2023-06-11T00:13:30+05:30 IST