రాష్ట్రస్థాయి ర్యాపిడ్‌ చెస్‌ పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపిక

ABN , First Publish Date - 2023-06-26T00:04:56+05:30 IST

రాష్ట్ర స్థాయి ర్యాపిడ్‌ చెస్‌ పోటీలకు జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులను ఎంపిక చేశారు.

రాష్ట్రస్థాయి ర్యాపిడ్‌ చెస్‌ పోటీలకు  జిల్లా క్రీడాకారుల ఎంపిక
విజేతలతో నిర్వాహకులు

భీమవరం అర్బన్‌, జూన్‌ 25: రాష్ట్ర స్థాయి ర్యాపిడ్‌ చెస్‌ పోటీలకు జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులను ఎంపిక చేశారు. పశ్చిమగోదావరి జిల్లా చెస్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో అనసూయ చెస్‌ అకాడమీలో ఆదివారం జిల్లాస్థాయి ర్యాపిడ్‌ చెస్‌ ఎంపిక పోటీలు నిర్వహిం చారు. జిల్లా నలుమూలల నుంచి 33 మంది క్రీడాకారులు పాల్గొనగా, తణుకు పట్టణానికి చెందిన పి.స్వాతిక్‌, యండగండికి చెందిన ఎన్‌.సాయికాంత్‌ విజేతలుగా నిలిచారు. వీరు జూలై 22, 23 తేదీలలో భీమవరం ప్యాడీ రైస్‌ మర్చంట్స్‌ అసోషియేషన్‌ భవనంలో జరిగే రాష్ట్ర స్థాయి ర్యాపిడ్‌ చెస్‌ పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారని చెస్‌ అసోషియేషన్‌ జిల్లా అధ్యక్షులు మాదాసు కిషోర్‌ తెలిపారు. జిల్లా సంయుక్త కార్యదర్శి మైలపురి మురళి, పి.రవిప్రసాద్‌, కిడ్జిప్లే స్కూల్‌ ప్రిన్సిపాల్‌ కె. శ్రీదేవి పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:04:56+05:30 IST