కన్నులపండువగా రామానుజ ప్రియ గోవింద కల్యాణం
ABN , First Publish Date - 2023-09-18T00:16:36+05:30 IST
శ్రీ రామానుజ ప్రియ గోవింద కల్యాణోత్సవం ఆదివారం కన్నుల పండువగా జరిగింది.

ఆకివీడు, సెప్టెంబరు 17: శ్రీ రామానుజ ప్రియ గోవింద కల్యాణోత్సవం ఆదివారం కన్నుల పండువగా జరిగింది. స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మందిరంలో సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రియ గోవింద కల్యాణోత్సవం రాజమండ్రికి చెందిన వేద పండితులు పరాశర రఘునాఽథభట్టర స్వామి పర్యవేక్షణలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గొంట్లా గణపతి నేతృత్వంలో అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు రామానుజ ట్రస్టుకు రూ.1.65 లక్షలు అందజేశారు. ఎమ్మెల్యే మంతెన రామరాజు కల్యాణాన్ని తిలకించి మాట్లాడారు. సమాజంలో ఆధ్యాత్మికచింతన పెంపొందేలా పండితులు, ఘనాపాఠీలు, అర్చకులు కృషి చేయాలన్నారు. సన్నిధి ఽవెంకన్నబాబు, గుర్రం శ్రీనివాసరావు, ఈశ్వరరావు, సన్నిధి వెంకటేశ్వరరావు, గొంట్లా సత్యనారాయణ, కృష్ణమూర్తి, నేరెళ్ళ రామచెంచయ్య, బొండాడ రాధాకృష్ణ, పేరూరి రాధాకృష్ణ, బొల్లా వెంకట్రావు, జామి హైమావతి, షేక్ రసూల్‌బీబీహుస్సేన్, మోరా జ్యోతిరెడ్డి, నరహరశెట్టి రాఘవ తదితరులు ఉన్నారు.