ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు

ABN , First Publish Date - 2023-04-27T00:10:48+05:30 IST

ధాన్యం కొనుగోలు సమస్యలను పరిష్కరిం చాలని రైతులు కైకరం ఆర్బీకే వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు.

ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు
కైకరం ఆర్బీకే వద్ద ధర్నా చేస్తున్న రైతులు

ఉంగుటూరు మండలం కైకరంలో రైతుల ధర్నా

ఉంగుటూరు, ఏప్రిల్‌ 26: ధాన్యం కొనుగోలు సమస్యలను పరిష్కరిం చాలని రైతులు కైకరం ఆర్బీకే వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు గోనె సంచులు ఇవ్వాలని, ధాన్యం రవాణాకు లారీలు సమకూర్చాలని నినాదాలు చేశారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌, కౌలు రైతు సంఘం జిల్లా కన్వీన ర్‌ కొర్ని అప్పారావు, వెజ్జు శ్రీరామమూర్తి, రైతులు నెర్సు శ్రీనివాసరావు, తమ్మినీడి నాగేశ్వరరావు, జంగం దుర్గారావు, కర్రి చిన్నారావు పాల్గొన్నారు. రైతుల ఆందోళన ఫలితంగా ఎట్టకేలకు గోనె సంచులు అందజేశారు.

జిల్లాలో రైతులకు సంచుల కొరత లేదని రవాణా సౌకర్యం సమస్యలు లేవని అసిస్టెంట్‌ కలక్టర్‌ అపూర్వ భరత్‌ అన్నారు. ఉంగుటూరులో ధాన్యం సేకరణ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసారు. మండలంలో ఇప్పటికే లక్ష గోనె సంచులు అందించామని, 11వేల క్వింటాళ్ళ ధాన్యం సేకరణ జరిగిందన్నారు. బుధవారం ఒక్కరోజే 30వేల సంచులు రైతులకు పంపిణీ చేశామన్నారు. రైతులకు సమస్య ఉంటే తహసీల్దార్‌కు గాని రైతు భరోసా కేంద్రంలో తెలియజేయాలన్నారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయాధికారి వై.రామకృష్ణ, తహసీల్దార్‌ వెంకట రమణ, ఏవో వెంకటేశ్‌, వీఆర్వోలు ఉన్నారు.

Updated Date - 2023-04-27T00:10:48+05:30 IST