కేంద్ర ప్రభుత్వ విధానాలపై రైతుల నిరసన
ABN , First Publish Date - 2023-01-27T00:22:28+05:30 IST
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతు వ్యతి రేక విధానాలు విడనాడాలని అఖిలపక్ష రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
ఏలూరు టూ టౌన్, జన వరి 26 : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతు వ్యతి రేక విధానాలు విడనాడాలని అఖిలపక్ష రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రైతులు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు, టూ వీలర్స్‌తో గురువారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏఎస్‌ఆర్ స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీ పాతబస్టాండ్, జూట్ మిల్లు, ఫైర్‌స్టేషన్ వరకు సాగింది. కలెక్టరేట్‌కు వెళ్ళకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాయకులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక విధా నాలు నశించాలంటూ నినాదాలు చేశారు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో పలువురు నేతలు ప్రసం గించారు. పంటలకు గ్యారెంటీ మద్దతు ధర చట్టాన్ని తేవాలన్నారు. రైతుల రుణాలను మాఫీ చేయాలన్నారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగిస్తే సహించేంది లేదన్నారు. రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు నాగేంద్రనాధ్, కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాధరావు, రైతు సంఘం నాయకులు డేగా ప్రభాకర్, ఇప్టూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆర్.లింగరాజు, బీకేఎంయూ జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, రైతు కూలీ సంఘం నాయకులు షేక్ భాషా, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.