ఈదురు గాలుల బీభత్సం
ABN , First Publish Date - 2023-06-11T01:24:10+05:30 IST
చాట్రాయి, ముసు నూరు మండలాల్లో శుక్రవారం రాత్రి ఈదురుగాలులు బీభ త్సం సృష్టించాయి.
తుమ్మగూడెం, సూరేపల్లిలోకూలిన కోళ్లఫారాల షెడ్లు
సుమారు రూ.42 లక్షల నష్టం
చాట్రాయి/ ముసునూరు, జూన్ 10: చాట్రాయి, ముసు నూరు మండలాల్లో శుక్రవారం రాత్రి ఈదురుగాలులు బీభ త్సం సృష్టించాయి. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. కోళ్ల ఫారాల షెడ్లు ధ్వంసమయ్యాయి. చాట్రాయి మండలం తుమ్మగూడేనికి చెందిన షేక్ అబ్దుల్ జాహెద్ హుస్సేన్‌కు చెందిన కోళ్ల ఫారం షెడ్డు కూలిపోయి ఐదువేల కోడి పిల్లలు మృత్యువాత పడ్డాయి. రూ.30 లక్షల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోళ్లఫారం యజమాని విజ్ఞప్తి చేశాడు. ముసునూరు మండలం సూరేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ముళ్ళపూడి ప్రసాద్ కోళ్లను పెంచేందుకు రూ.12 లక్షలతో రేకుల షెడ్డు వేయగా ఈదురు గాలులకు షెడ్డు పూర్తిగా కూలి పోయింది. ఆర్థికంగా నష్టపోయా నని ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు.