వాహనాలకు బ్రేక్‌

ABN , First Publish Date - 2023-02-16T00:22:21+05:30 IST

దెందులూరు – శ్రీరామవరం రహదారిలో రైల్వేగేట్‌

వాహనాలకు బ్రేక్‌
దెందులూరు – శ్రీరామవరం రహదారిలో రైల్వే గేటు

దెందులూరు – శ్రీరామవరం రహదారిలో రైల్వేగేట్‌

7 గ్రామాల ప్రజలకు తిప్పలు

కార్యరూపం దాల్చని ఫ్లైఓవర్‌

దెందులూరు, ఫిబ్రవరి 15: దెందులూరు–శ్రీరామవరం దశాబ్దాల నుంచి రైల్వేగేటుతో 7 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైల్వేగేటు స్థానంలో ఫైఓవర్‌ నిర్మించాలని గేటు పడితే నాలుగైదు రైళ్లు వెళ్లేవరకూ 40 నిముషాల పాటు వాహనాలు నిలిచిపోవాల్సిందే. దశాబ్దా లుగా ప్రయాణికులు రైల్వేగేట్‌ స్థానంలో ఫ్లైఓవర్‌ నిర్మించాలని కోరుతున్నా అరణ్య రోదనగానే మిగిలింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైల్వే గేటు స్థానంలో ఫైఓవర్‌ నిర్మించాలని రామారావుగూడెం గ్రామానికి చెం దిన మద్దా భూషణం గతంతో కోర్టును ఆశ్రయించారు. అప్పటి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకువెళ్లడంతో కొంత కదలిక వచ్చింది. దెందులూరు – పంగిడిగూడెం రోడ్డు అభివృద్ధికి చంద్రబాబు నిధు లు విడుదల చేశారు. రెండులైన్ల రహదారి విస్తరణ, రైల్వేగేటు స్థానంలో ఫైఓవర్‌ నిర్మాణానికి చర్యలు తీసుకునే లోపు ప్రభుత్వం మారింది. తర్వాత అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. రహదారి విస్తరణ, ఫ్లైఓవర్‌ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని రామారావుగూడెం, చల్ల చింత లపూడి, పెరుగుగూడెం, శ్రీరామవరం, అప్పారావుపాలెం, మేదినరావుపాలెం, సత్యనారాయణపురం తదితర మెట్ట గ్రామాల ప్రజలు కోరుతున్నారు. పలుచోట్ల చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు కావడంతో రైల్వే గేటుతో సిబ్బంది, ఉద్యోగులు, రవాణా వాహనాలు గేటు ముందు గంట పాటు ఉండటంతో నిలిచిపోతున్నాయి. 7 గ్రామ ప్రజలు విద్య, వైద్య అవసరాలకు వెళ్లడానికి గేటు వద్ద వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. రైల్వే గేటు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని వివిధ గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

చిన్న పరిశ్రమలకు పెద్ద సమస్య

రైల్వే గేట్‌ చిన్న పరిశ్రమలకు పెద్ద సమస్యగా మా రింది. ఆర్థిక సమస్యలున్నా చిన్న పరిశ్రమ నిర్వహి స్తున్నాం. గేటు వలన ఉద్యోగులు సమయానికి రాలేక పోతునున్నారు. వాహనాలు చాలా సమయం గేటు ముందు వేచి ఉంటున్నాయి. కిరాయి ఎక్కువ కావడంతో నష్టాలు తప్పడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారం చూపించాలి.

కోటగిరి శ్రీనివాసరావు, చిన్న తరహా పరిశ్రమ యాజమాని

రైతులకు తప్పని తిప్పలు

సాగుకు అవసరాలు, పంట తరలించడానికిరైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గేటు సమీపంలో అండర్‌పాస్‌ నిర్మాణానికి రైల్వే అధికారులు ప్రయత్నం చేయడంతో 7 గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్లైవర్‌ నిర్మించాలని పంచాయతీలు తీర్మానం చేసి తహసీల్దార్‌ ద్వారా కలెక్టర్‌, రైల్వే ఉన్నతాధికారులకు పంపించారు.

కలపాల చంద్రశేఖర్‌, రైతు నేత, సత్యనారాయణపురం

మెట్ట గ్రామాలు అభివృద్ధికి దూరం

రైల్వేగేటుతో మెట్ట గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. గంటల తరబడి రైల్వేగేటు వద్ద వేచి ఉండా ల్సిన పరిస్థితిలో భీమడోలు మీదుగా రవాణా సౌకర్యం పెరిగి ఇటు అభివృద్ధి చెందడంలేదు. గ్రామాల్లో అత్యవ సర వైద్య సేవల నిమిత్తం వెళ్లే అంబులెన్స్‌లు సైతం రైల్వేగేటు వద్ద అర్థగంట నిలిచిపోవాల్సి వస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి.

మద్దా భూషణం, రామారావుగూడెం, ఫ్లైఓవర్‌ పోరాట సమితి అధ్యక్షుడు

Updated Date - 2023-02-16T00:23:17+05:30 IST