చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై నిరసనల జ్వాల!
ABN , First Publish Date - 2023-09-21T23:51:58+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ ఆరెస్ట్‌కు నిరసన చేపట్టిన రిలేదీక్షలు గురువారం తొమ్మిదో రోజుకు చేరాయి.
ముసునూరు/చాట్రాయి/నూజివీడు/కైకలూరు, సెప్టెంబరు 21: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ ఆరెస్ట్‌కు నిరసన చేపట్టిన రిలేదీక్షలు గురువారం తొమ్మిదో రోజుకు చేరాయి. పెద్ద సంఖ్యలో నాయకులు దీక్షలో పాల్గొని నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. చంద్రబాబును కక్ష పూరితంగానే ఆరెస్ట్ చేశారన్నారు. తొందరలోనే కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అన్నారు. కందుల పిచ్చియ్య, గద్దె రఘుబాబు, బొల్లినేని బుజ్జియ్య, పర్వతనేని శ్రీనివాసరావు, ఉండవల్లి ధర్మరాజు, భీమయ్య, పల్లిపాము జయరాజు, కర్ర ఏసుపాదం, శేషు, కొల్లి గంగారామ్, గారపాటి నరసింహరావు, మండవ బుజ్జియ్య, కాటేపల్లి సత్యనారాయణ, లక్కపాము కాంతరావు తదితరులు పాల్గొన్నారు.
చాట్రాయి మండలం పోలవరంలో చంద్రబాబును విడుదల చేయాలంటూ యర్రా హేమంతకుమార్ ఆధ్వర్యంలో ఆంజనేయస్వామి ఆలయం నుంచి రామాలయం వరకు టీడీపీ శ్రేణులు ప్రదర్శన నిర్వహించారు. పూజలు చేసి హనుమాన్ ఛాలీసా పారాయణం చేశారు. చాగంటి నరసింహారావు, బుచ్చిబాబు, మరిడి చిన్న అప్పారావు, పర్వతనేని నాగేశ్వరరావు, సీతారామయ్య, పెదరాయుడు, ప్రసాద్ పాల్గొన్నారు. తెలుగురైతు జిల్లా ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చంద్రబాబుకు మద్దతు తెలుపుతూ చనుబండ నుంచి సుమారు వెయ్యి మంది రాజమహేంద్రవరం జైలుకు పోస్టు కార్డులు పంపారు.
నూజివీడు పట్టణ పరిధిలో రిలేనిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. పట్టణ అధ్యక్షులు మల్లిశెట్టి జగదీష్, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ చెరుకూరి దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి పల్లి నాగరాజు, పాదం సత్యనారాయణ, మండా శ్రీనివాసరావు, సయ్యద్ షబ్బీర్, దారుగ జగదీష్ రిలేనిరాహారదీక్షల్లో పాల్గొన్నారు. మొర్సపూడిలో గిరిజన మహిళలు నిరసన తెలిపారు. ఒడిత్యా వెంకాయమ్మ, బాణావతు మంగమ్మ,కోమటి, పాలత్యా రత్తమ్మ, చెంగా, సోమలి దీక్ష చేపట్టారు. పిన్నమనేని ప్రదీప్, షేక్ బాజీ, పి. రామచంద్రరావు, కె.వై.ప్రసాద్ పాల్గొన్నారు. ముక్కొల్లుపాడులో పర్వతనేని సాయి ఆధ్వర్యంలో చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ నేతలు నిరసన తెలిపారు. అనంతరం బాబుకు అండగా మేముసైతం అంటూ పోస్టుకార్డు ఉద్యమంలో భాగస్వాములయ్యారు.
కైకలూరులో టీడీపీ కార్యాలయం వద్ద మండవల్లి మండల నేతలు నారగాని వీరవెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రిలేనిరాహార దీక్షలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠలరావు, ముదినేపల్లి నేత కొడాలి వినోద్ సంఘీభావం తెలిపారు. దీక్షలో సగర సాధికార కమిటీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గజ్జల గణేష్, యాదవ సాధికార సమితి రాష్ట్ర సభ్యుడు తలారీ రాజేష్, ముళ్ళపూడి సత్తిబాబు, చాబత్తిన విజయ్, పళ్ళెం వెంక టేశ్వరరావు, కూనపురెడ్డి కోటేశ్వరరావు, బొమ్మనబోయిన విజయలక్ష్మీ, వీరమల్లు నరసింహారావు, పెన్మెత్స త్రినాధ రాజు, పూల రామచంద్రరావు, ఆగోళ్ళు బలేస్వామీ, పోలవరపు లక్ష్మీరాణి, గంగుల శ్రీదేవి, కందేపి పద్మ, గుజ్జల రామలక్ష్మీ, దారం సుధా, పాల్గొన్నారు.