సమస్యల గేట్
ABN , First Publish Date - 2023-05-29T23:36:59+05:30 IST
ఎంత సుదూరం నుంచి లేదా పక్క ప్రాంతం నుంచి ప్రయాణం చేసినా అక్కడ ఆగాల్సిందే. అత్యవసరమైనా అక్కడ వాహనాలకు బ్రేక్ వేయాల్సిందే.. వేచి ఉండాల్సిందే.
రైలు వచ్చేవరకు ఆగాల్సిందే
దెందులూరు ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బందులు
ప్లైఓవర్ నిర్మించాలని డిమాండ్
దెందులూరు, మే 29: ఎంత సుదూరం నుంచి లేదా పక్క ప్రాంతం నుంచి ప్రయాణం చేసినా అక్కడ ఆగాల్సిందే. అత్యవసరమైనా అక్కడ వాహనాలకు బ్రేక్ వేయాల్సిందే.. వేచి ఉండాల్సిందే. ఏళ్ల తరబడి అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. ఎవరికి ఎన్నిసార్లు విన్నవించినా సమ స్యకు పరిష్కారం లభించలేదు. దెందులూరు–శ్రీరామవరం రైల్వేగేట్ వద్ద దశాబ్దాల నుంచి తిష్టవేసిన సమస్య ఇది. గేట్ స్థానంలో ఫ్లైఓవర్ నిర్మిం చాలని దెందులూరు మండల ప్రజలు మొత్తుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఒకసారి గేటుపడితే నాలుగైదు రైళ్లు వెళ్లే వరకు దాదాపు అర్థ గంటకు పైగా వేచి ఉండాలని పరిసర గ్రామాల ప్రజలు వాపోతు న్నారు. బస్సులు, స్కూల్ బస్సులు, ఫ్యాక్టరీ వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు, ప్రయాణికులు, వ్యాపారులు నష్టాలు ఎదుర్కొనవలసి వస్తోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైల్వేగేటు స్థానంలో ఫ్లైఓవర్ నిర్మించి సమస్య పరిష్కరించాలని రామారావుగూడెం గ్రామానికి చెందిన మద్దా భూషణం గతంతో కోర్టును ఆశ్రయించారు. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టి తీసుకువెళ్లడంతో దెందులూరు– పంగిడి గూడెం రోడ్డును అభివృద్ధి చేయాలని నిధులు విడుదల చేశారు. రెండులైన్ల రహదారిగా విస్తరించే చర్యలు తీసు కుని రైల్వేగేటు స్థానంలో ఫైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈలోపు ప్రభుత్వం మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోలేదని ప్రజలు ఆరోపిస్తు న్నారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రామారావు గూడెం, చల్లచింతలపూడి, పెరుగుగూడెం, శ్రీరామవరం, అప్పారావుపాలెం, జోగన్నపాలెం, అప్పారావుపాలెం, కంఠమనేనివారిగూడెం, మేదినరావు పాలెం, మెట్ట గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
మెట్ట గ్రామాలు అభివృద్ధికి దూరం
దెందులూరు–పంగిడిగూడెం రహదారిలో రైల్వేగేటు కారణంగా మెట్ట గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉ న్నాయి. గంటల తరబడి రైల్వేగేటు వద్ద వేచి ఉండ వలసి ఉండడంతో భీమడోలు మీదుగా రవాణా సౌకర్యం పెరిగింది. అత్యవసర వైద్యసేవల నిమిత్తం రోగులను తరలించే అంబులెన్స్‌లు సైతం రైల్వేగేట్ వద్ద అర్థగంట పాటు నిలిచిపోవాల్సి వస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి.
మద్దా భూషణం, ఫైఓవర్ పోరాట సమితి అధ్యక్షుడు
పరిశ్రమలకు ఇబ్బందులు
చిన్న తరహా పరిశ్రమలకు రైల్వేగేట్‌తో ఇబ్బందులు తప్పడం లేదు. ఉద్యోగులు, రవాణా వాహనాలు, సిబ్బంది గంటల కొద్దీ దెందులూరు రైల్వే గేటు వద్ద ఆగాల్సిందే. గేటు దగ్గర తుతూ మంత్రంగా అండర్ పాస్ లోబ్రిడ్జి ఏర్పాట్లు చేశారు. నాలుగు నెలల క్రితం ఆరు గ్రామాల ప్రజలందరూ లోబ్రిడ్జి వద్దని తీర్మానం చేశారు. రైల్వేగేటు స్థానంలో ప్లైవర్ నిర్మించాలని అందరూ కోరుతున్నారు.
కలపాల చంద్రశేఖర్, చిన్నతరహా పరిశ్రమ యజమాని
అధికారులు స్పందించాలి
దెందులూరు–శ్రీరామవరం రైల్వే గేటు వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైల్వే గేటు రూటులో సంవత్స రానికి లక్ష వాహనాలు దాటి ప్రయాణిస్తే ప్లైవర్ నిర్మించవచ్చని నిబంధన ఉంది. కానీ చర్యలు తీసుకోవడం లేదు గేటు పడితే చాలా సమయం వేచి ఉండాల్సి వస్తుంది. రైల్వే అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి.
బాదంపూడి రమేష్‌బాబు, మోకానిక్, మేదినరావుపాలెం