వీఆర్వోలకు ప్రొబేషన్ డిక్లేర్ చేయండి
ABN , First Publish Date - 2023-03-21T00:00:05+05:30 IST
గ్రేడ్ –2 వీఆర్వోలకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని ఏపీ వీఆర్వో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు విజ్ఞప్తి చేశారు.
ఏలూరు కలెక్టరేట్, మార్చి 20: గ్రేడ్ –2 వీఆర్వోలకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని ఏపీ వీఆర్వో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పని చేస్తున్న గ్రేడ్ –2 వీఆర్వోల ప్రొబేషన్ పిరియడ్ విషయమై ఉద్యోగులతో కలిసి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ స్పందించి వెంటనే దీనికి సంబంధించి ఫైల్ పెట్టాలని అధికారులను ఆదేశించినట్లు ఈ సందర్భంగా రవీంద్రరాజు తెలిపారు. రాష్ట్ర నాయకులు జోషి, అక్బర్, జిల్లా కోశాధికారి రవి, అజయ్, డివిజన్ సెక్రటరి లూర్దురాజు, వీఆర్వోలు శ్రీహరి, ఒకుళాదేవి, సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు.