పోలీస్‌ సిబ్బంది బదిలీలు

ABN , First Publish Date - 2023-05-27T00:24:43+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలో పోలీస్‌శాఖలో బదిలీలకు జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి శ్రీకారం చుట్టారు.

పోలీస్‌ సిబ్బంది బదిలీలు
బదిలీలు నిర్వహిస్తున్న ఎస్పీ

ఏలూరు క్రైం, మే 26 : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలో పోలీస్‌శాఖలో బదిలీలకు జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి శ్రీకారం చుట్టారు. ఏలూరు జిల్లా పోలీస్‌ కార్యాలయం సమావేశ మందిరంలో పోలీస్‌ సిబ్బందికి కౌన్సిలింగ్‌ నిర్వహించారు. జిల్లాలో ఐదేళ్ల కాలపరి మితి ఒకే పోలీస్‌ స్టేషన్‌లో పూర్తి చేసుకున్న ఏఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబు ల్‌, కానిస్టేబుళ్లకు ఈ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఏఏ పోలీస్‌ స్టేషన్లలో ఖాళీ ఉన్నాయో వీడియో ద్వారా ప్రదర్శించి సిబ్బంది కోరుకున్న ప్రాం తాలకు బదిలీ చేశారు. ఎలాంటి రికమండేషన్లు లేకుండా ఖాళీను బట్టి సిబ్బంది కోరుకున్న చోటకు బదిలీ చేశారు. దీంతో పోలీస్‌ సిబ్బంది ఎస్పీ మేరీ ప్రశాంతికి కృతజ్ఞతలు తెలిపారు. అడ్మిన్‌ ఎంజేవీ భాస్కర రావు, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారావు పలువురు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-27T00:24:43+05:30 IST