లోన్‌ యాప్‌లపై ఆకర్షితులు కావొద్దు

ABN , First Publish Date - 2023-08-22T00:33:52+05:30 IST

యువత, మహిళలు ఆన్‌లైన్‌, ఇన్‌ స్టెంట్‌ లోన్‌యాప్‌ల పట్ల ఆకర్షితులు కాకుండా అప్ర మత్తంగా ఉండాలని ఎస్పీ మేరీ ప్రశాంతి సూచించారు.

లోన్‌ యాప్‌లపై ఆకర్షితులు కావొద్దు
ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న ఎస్పీ

ఏలూరు క్రైం : యువత, మహిళలు ఆన్‌లైన్‌, ఇన్‌ స్టెంట్‌ లోన్‌యాప్‌ల పట్ల ఆకర్షితులు కాకుండా అప్ర మత్తంగా ఉండాలని ఎస్పీ మేరీ ప్రశాంతి సూచించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహిం చిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుంచి మొత్తం 45 ఫిర్యాదులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి సత్వర ఆదేశాలు జారీ చేశారు. రిజర్వుబ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి గుర్తింపు పొందిన బ్యాంకుల్లో, నాన్‌ బ్యాంక్‌ కంపెనీల వద్ద వ్యక్తిగతంగా హాజరై రుణాలు తీసుకోవడం మంచిదని సూచించారు.

అమరులైన పోలీస్‌ సిబ్బంది కుటుంబ సభ్యులకు అందాల్సిన సౌకర్యాలను సత్వరం అందేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా పోలీస్‌ శాఖలో పనిచేస్తూ అనారోగ్య కారణాల వల్ల మరణించిన పోలీస్‌ సిబ్బంది కుటుంబ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ అమరవీరుల కుటుంబంలో అర్హత కల్గిన పిల్లలకు కారుణ్య నియామకాల కోసం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. దిశ డీఎస్పీ నున్నా మురళీకృష్ణ, ప్రధాన కార్యాలయ ఏవో డీవీఎస్‌ఆర్‌కే నాయక్‌ పాల్గొన్నారు. హెడ్‌కానిస్టేబుల్‌ పి.శ్రీనివాసరావు అనారోగ్యంతో ఈఏడాది జూన్‌ 30న మరణించగా అతని సతీమణి జ్యోతికి లక్ష రూపాయల చెక్కును ఎస్పీ అందించారు.

Updated Date - 2023-08-22T00:34:15+05:30 IST