కొండంతా భక్తులే..
ABN , First Publish Date - 2023-12-11T00:15:19+05:30 IST
చిన్నతిరుమలేశుని దివ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. అందరికీ సెలవు రోజు కావడంతో పాటు త్రయోదశి తిథి మంచిది కావడంతో ఆలయానికి యాత్రికుల రాక ప్రారంభమైంది.
భక్తులతో కిటకిటలాడిన శ్రీవారి క్షేత్రం
ద్వారకా తిరుమల, డిసెంబరు 10 : చిన్నతిరుమలేశుని దివ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. అందరికీ సెలవు రోజు కావడంతో పాటు త్రయోదశి తిథి మంచిది కావడంతో ఆలయానికి యాత్రికుల రాక ప్రారంభమైంది. ఆలయంలోని అన్ని విభాగాలు భక్తులతో కిటకిటలాడాయి. కొండపై పార్కింగ్ ప్రాంతం కార్లు, ద్విచక్ర వాహనాలతో నిండింది. సుమారు 20 వేల మంది వరకు యాత్రికులు స్వామి, అమ్మవార్లను దర్శించినట్టు ఆలయ వర్గాలు తెలిపాయి. శ్రీవారి దర్శనానికి మూడు గంటల పైబడి సమయం పట్టింది. దర్శనానంతరం వారంతా ఉచిత అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.