Share News

ఆపిన పింఛన్‌ అందించారు

ABN , First Publish Date - 2023-12-04T01:32:27+05:30 IST

నూజివీడు మండలం బత్తులవారి గూడెం గ్రామంలో వృద్ధురాలికి నిలిపివేసిన పింఛన్‌ను గ్రామ కార్యదర్శి చంద్రిక ఆదివారం లబ్ధిదారుకు అందించారు.

 ఆపిన పింఛన్‌ అందించారు

నూజివీడు టౌన్‌, డిసెంబరు 3: నూజివీడు మండలం బత్తులవారి గూడెం గ్రామంలో వృద్ధురాలికి నిలిపివేసిన పింఛన్‌ను గ్రామ కార్యదర్శి చంద్రిక ఆదివారం లబ్ధిదారుకు అందించారు. ఇటీవల నిర్వహించిన సీఎం సభకు రాలే దని వృద్ధురాలు సాతులూరి సంజీవమ్మకు పింఛన్‌ ఆపివేసిన విషయమై ‘సీఎం సభకు రాలేదని... 78 ఏళ్ల వృద్ధురాలికి పింఛను ఆపేశారు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ లో ఆదివారం కథనం ప్రచురితమైన నేపధ్యంలో గ్రామ కార్యదర్శి చంద్రిక స్పందిస్తూ వృద్ధురాలు సంజీవమ్మను స్వయంగా కలిసి పింఛన్‌ను అందించారు.

Updated Date - 2023-12-04T01:32:30+05:30 IST