బదిలీ టీచర్లకు జీతాలు చెల్లించండి
ABN , First Publish Date - 2023-08-06T00:45:52+05:30 IST
బదిలీలు, పదోన్నతులు, సర్దుబాటు జరిగిన ఉపాధ్యాయులకు గత రెండు నెలలుగా జీతాలు చెల్లించక పోవడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం సాయంత్రం ఏలూరు తహసిల్దార్ కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఏలూరురూరల్/నిడమర్రు/జంగారెడ్డిగూడెం, ఆగస్టు 5: బదిలీలు, పదోన్నతులు, సర్దుబాటు జరిగిన ఉపాధ్యాయులకు గత రెండు నెలలుగా జీతాలు చెల్లించక పోవడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం సాయంత్రం ఏలూరు తహసిల్దార్ కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తహసిల్దార్ బి సోమశేఖర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర కార్యదర్శి సాల్మన్‌రాజు మాట్లాడుతూ జూన్, జూలైకు సంబంధించిన జీతాలు నేటికీ అందలేదని దీని వల్ల ఉపాధ్యాయులు ఆర్ధిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. జిల్లా అధ్యక్షులు రెడ్డిదొర మాట్లాడుతూ వేతనమే జీవనాధారమైన ఉపాధ్యాయులకు రెండు నెలల జీతాలు చెల్లించకపో వడం సరికాదన్నారు. రామారావు, ప్రకాష్, శ్రీనివాసరావు, రమాదేవి, సుబ్రమణ్యం, రత్నకుమార్, రాజారావు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులకు తక్షణం జీతాలు చెల్లించాలని ఏపీటీఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి యస్.రంగావళి డిమాండ్ చేశారు. శనివారం సంఘం రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు నిడమర్రు తాసీల్ధార్ కార్యాలయం వద్ద టీచర్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేడర్ స్ర్టెంత్ పేరుతో ఉపాధ్యాయులకు సుమారు రెండు నెలల జీతాలు అందజేయకపోవడం దారణమని అన్నారు. అనంతరం తహసీల్ధార్ సాయి రాజ్‌కు వినతిపత్రం అందజేశారు. కొండయ్య, జయప్రకాష్‌నారాయణ, ప్రసాద్, కణితి కృష్ణకుమార్, కె.లలితకుమారి, లక్ష్మీనారాయణ, సుబ్బరాజు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. గత రెండు నెలలుగా ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించకుండా ప్రభుత్వం నిరంకుశ వైఖరిని ప్రదర్శిస్తుందని ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి యువిఎన్ రాజు అన్నారు. కొత్తగా ఎంఈఓ పోస్టులు నియామకాలు చేపట్టినా వారికీ జీతాలు చెల్లించలేదన్నారు. రాజ్యలక్ష్మి, రత్నం, కె.సుబ్బారావు పాల్గొన్నారు.