కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
ABN , First Publish Date - 2023-03-20T00:09:38+05:30 IST
వైద్యశాఖలో కాంట్రాక్టు ఔట్‌సొర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఎంపీహెచ్‌ఏ (ఎం), స్టాఫ్ నర్స్, ఏఎన్‌ఎంలతో పాటు మిగిలిన వారిని వెంటనే రెగ్యులర్ చేయాలని ఏపీ కాంట్రాక్టు ఔట్‌సొర్సింగ్ సర్వీస్ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నూతక్కి ప్రసాద్ బాబు డిమాండ్ చేశారు.

తాడేపల్లిగూడెం రూరల్, మార్చి 19 : వైద్యశాఖలో కాంట్రాక్టు ఔట్‌సొర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఎంపీహెచ్‌ఏ (ఎం), స్టాఫ్ నర్స్, ఏఎన్‌ఎంలతో పాటు మిగిలిన వారిని వెంటనే రెగ్యులర్ చేయాలని ఏపీ కాంట్రాక్టు ఔట్‌సొర్సింగ్ సర్వీస్ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నూతక్కి ప్రసాద్ బాబు డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెం ఎన్జీవో హోంలో ఆదివారం సంఘ సమావేశం నిర్వహించారు. జీవో నెంబర్ 27ని సవరించి 100 శాతం గ్రాస్ శాలరీ పునరుద్ధరించాలని, చనిపోయిన కాంట్రాక్టు ఉద్యోగులకు సహజ మరణాలైతే రూ.20 లక్షలు, ప్రమాద మరణాలైతే రూ.50 లక్షలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లు ఉండేలా జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. తొలుత జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నూతక్కి ప్రసాద్‌బాబు, ప్రధాన కార్యదర్శిగా వెంపలి వీరవెంకట రాజు, కో ఆర్డినేటర్‌గా కిలారి రామకృష్ణ ఎన్నికయ్యారు.