ఒకే నంబర్‌పై రెండు కార్లు !

ABN , First Publish Date - 2023-09-20T00:39:48+05:30 IST

ఒకే నెంబర్‌.. రెండు కార్లు.. ఒరిజినల్‌ కారు పాలకొల్లు ది. నకిలీ నెంబరుతో మరొకటి హైదరాబాద్‌లో తిరుగుతోంది. అక్కడ జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మల్లంపేట వద్ద ట్రాఫిక్‌ రూల్స్‌ బ్రేక్‌ చేశావంటూ పాలకొల్లుకు చెందిన తుమ్మిడి నాగభూషణానికి రూ.1035 ఫైన్‌ కట్టాలంటూ మంగళవారం మెసేజ్‌ వచ్చింది. దీంతో యజమాని ఖంగుతిన్నాడు.

ఒకే నంబర్‌పై రెండు కార్లు !

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రూరల్స్‌ బ్రేక్‌ చేశారంటూ

పాలకొల్లు కారు యజమానికి రూ.1035 ఫైన్‌..

పాలకొల్లు రూరల్‌, సెప్టెంబరు 19: ఒకే నెంబర్‌.. రెండు కార్లు.. ఒరిజినల్‌ కారు పాలకొల్లు ది. నకిలీ నెంబరుతో మరొకటి హైదరాబాద్‌లో తిరుగుతోంది. అక్కడ జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మల్లంపేట వద్ద ట్రాఫిక్‌ రూల్స్‌ బ్రేక్‌ చేశావంటూ పాలకొల్లుకు చెందిన తుమ్మిడి నాగభూషణానికి రూ.1035 ఫైన్‌ కట్టాలంటూ మంగళవారం మెసేజ్‌ వచ్చింది. దీంతో యజమాని ఖంగుతిన్నాడు. హైదరాబాద్‌ పోలీసులు ఫొటో ద్వారా పంపిన బెంజ్‌ కారు నెంబరు, తన కారు నెంబరు ఒకటే కావడంతో అవాక్కయ్యాడు. తన టాటా టీయాగో ఎన్‌ఆర్‌జీఎక్స్‌–2 కారుకు హైదరాబాదులో ఫైన్‌ పడటం ఏమిటని గగ్గోలు పెట్టాడు. తన కారు నెంబరుతో తిరుగుతున్న కారుతో యాక్సిండెంటు చేస్తే ఎవరు బాధ్యులని వాపోతున్నారు. హైదరాబాద్‌ పోలీసులు పరిశీలన చేసి చలానాను రద్దు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. దీనిపై పాలకొల్లు ఎస్‌ఐ ముత్యాలరావుని వివరణ కోరగా ట్రాఫిక్‌ పోలీసులు ఒక్కోసారి దూరం నుంచి ఫొటోలు తీయడం వల్ల చలానా కొట్టేటప్పు డు పొరపాటు జరిగి ఉండవచ్చు. వేరే వారికి చలానా వెళ్ళవచ్చు. ఈ విధంగా జరిగినట్లయితే చలానాలు జాగ్రత్తగా పెట్టుకుని పోలీసులు ఆపినప్పుడు ఆ కారును చూపిస్తే ఎటువంటి రుసుము పోలీసులు వసూలు చేయరు. అక్కడి పోలీసులను సంప్రదిస్తే చలానా పూర్తిగా రద్దు చేస్తారని వివరణ ఇచ్చారు.

Updated Date - 2023-09-20T00:39:48+05:30 IST