విద్యుదాఘాతంతో ఒకరి మృతి
ABN , First Publish Date - 2023-09-26T00:44:38+05:30 IST
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన నూజివీడు మండలం అన్నవరం గ్రామంలో సోమవారం చోటుచేసు కుంది.

నూజివీడు టౌన్, సెప్టెంబరు 25: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన నూజివీడు మండలం అన్నవరం గ్రామంలో సోమవారం చోటుచేసు కుంది. రూరల్ ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం అన్నవరంలో నిర్మాణం లో ఉన్న ఇంటికి వాటరింగ్ చేసి మోటారు స్విచ్‌ను ఆపుచేసే సమయంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై కొరాటి బాలాజి (37) మృతి చెందాడు. మృతుడు నూజివీడు బస్టాండు ఏరియాకు చెందిన వాడని ఎస్సై తెలిపారు.