విద్యుదాఘాతంతో ఒకరి మృతి
ABN , First Publish Date - 2023-07-02T00:35:33+05:30 IST
విద్యుదాఘాతంతో శనివారం ఒక వ్యక్తి మృతి చెందాడు.
కలిదిండి, జూలై 1 : విద్యుదాఘాతంతో శనివారం ఒక వ్యక్తి మృతి చెందాడు. కలిదిండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కర్రేటి వెంకన్న బాబు (50) రొయ్యల చెరువు గట్టుపై పచ్చగడ్డిని కొడవలితో కోస్తుండగా, విద్యుత్ వైర్లు కొడవలికి తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు ఉన్నారు. కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే వెంకన్న బాబు అకస్మాత్తుగా మృతి చెందటంతో కుటుంబసభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వాసుపత్రి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ కె.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.