అమెరికా నుంచి దైవదర్శనానికి వచ్చి..
ABN , First Publish Date - 2023-06-26T00:02:06+05:30 IST
ఆయన ఓ బ్యాంక్ మేనేజర్. తన చెల్లెలు, మేనకోడళ్లు అమెరికా నుంచి వచ్చారని ఎంతో ఆనందపడ్డారు. ఇక్కడ గుళ్లుగోపురాల్లో దైవదర్శనాలు చేయించాలని నిశ్చ యించారు.
ఏలూరు క్రైం, జూన్ 25 : ఆయన ఓ బ్యాంక్ మేనేజర్. తన చెల్లెలు, మేనకోడళ్లు అమెరికా నుంచి వచ్చారని ఎంతో ఆనందపడ్డారు. ఇక్కడ గుళ్లుగోపురాల్లో దైవదర్శనాలు చేయించాలని నిశ్చ యించారు. అనుకున్న ప్రకారం ఆదివారం తాను, భార్య, కుమారుడు, తల్లి, చెల్లెలు.. ఆమె ఇద్దరు కుమార్తెలతో కలిసి తన కారులోనే ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. సాయం త్రం తిరిగి బయలుదేరి వస్తుండగా మార్గమధ్య లో ఏలూరు సమీపంలోని చొదిమెళ్ళ వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఐదేళ్ల చిన్నారి మృతి చెందగా మిగిలిన ఆరుగురూ తీవ్రంగా గాయపడ్డారు. అమెరికా నుంచి వచ్చిన ఆ చిన్నారి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో చూసిన వారి మనస్సు కలిచివేసింది.
కృష్ణాజిల్లా ఉయ్యూరులో కెనరా బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్న శిష్టా శ్రీనివాససుబ్ర మణ్య సమీర్‌కుమార్ (45)కు భార్య పద్మావతి (40), కుమారుడు శ్రీకృష్ణ (10) ఉన్నారు. అతడి చెల్లెలు రాంపల్లి వందన (40) అమెరికాలో ఉంటున్నారు. ఇటీవలె బెంగుళూరుకు వచ్చి అక్క డ నుంచి సమీర్‌కుమార్ ఇంటికి తన ఇద్దరి కుమార్తెలయిన రాంపల్లి ప్రాజ్ఞ (18), రాంపల్లి సీతా అలివేణి ప్రణతి (5)తో కలిసి ఉయ్యూరు వచ్చారు. వీరితోపాటు సమీర్ తల్లి శిష్టా సీతా కుమారి (75) కారులో ద్వారకాతిరుమల స్వామి దర్శనానికి వెళ్లారు. సాయంత్రం నాలుగు గంట లకు బయలుదేరి ఉయ్యూరు వెళ్తుండగా చొదిమెళ్ళ వద్ద లారీని ఢీ కొంది. వీరిని హైవే అంబులెన్సులో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుచ్చారు. వైద్యులు పరీక్షించి అప్పటికే రాంపల్లి సీతా అలివేణి ప్రణతి మృతి చెందినట్లు గా నిర్ధారించారు. మిగిలిన వారంతా తీవ్ర గాయాలకు గురయ్యారు. వీరందరిని మెరుగైన చికిత్సకు విజయవాడకు రిఫర్ చేశారు.
ఇండియాలో ఉన్న బంధువులతో సరదా గడిపి దైవ దర్శనాలు చేసుకోవడానికి వచ్చిన రాంపల్లి వందన కుటుంబానికి తీరని విషాధం ఎదురైంది. తన బిడ్డను కాపాడడంటూ వైద్యులను వేడుకు న్న దృశ్యం చూపరులను కంటతడి పెట్టించింది. రూరల్ ఎస్‌ఐ లక్ష్మణబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చి క్షత గాత్రుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నా రు.చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.