ఎన్‌టీ రామారావు నినాదం పేదల సంక్షేమం
ABN , First Publish Date - 2023-01-18T23:06:01+05:30 IST
జిల్లాలో పలుచోట్ల టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు.
వర్ధంతి కార్యక్రమాల్లో టీడీపీ శ్రేణుల ఘన నివాళి
జిల్లాలో పలుచోట్ల టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. పేదల సంక్షేమమే నినాదంగా ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచి ఉంటారని పలువురు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారని, ఆయన స్ఫూర్తితో టీడీపీ శ్రేణులు ముందుకు సాగాలన్నారు.
ఏలూరు టూటౌన్, జనవరి 18: టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్య మంత్రి ఎన్‌టీ రామారావు వర్థంతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. పలు చోట్ల రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు(బాబు), ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బడేటి రాధాకృష్ణ (చంటి) ప్రారంభించారు. ఎన్‌టీఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అనాటి ప్రభంజనమే మళ్ళీ 2024లో కనబడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టడం ఖాయమన్నారు. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి వారి హృదయాల్లో ఎన్‌టీఆర్ చిరస్థాయిగా నిలిచి ఉన్నారన్నారు. ఎన్‌టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పాలి ప్రసాద్, ఉప్పాల జగదీష్‌బాబు, రఘు, దాసరి ఆంజనేయులు కొల్లేపల్లి రాజు, జుంజు మోజేష్, పూజారి నిరంజన్, చోడే వెంకటరత్నం, చవ్వా అరుణకుమారి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఫైర్ స్టేషన్ వరకు ర్యాలీగా వచ్చి ఎన్‌టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 3వ డివిజన్‌లో దాసరి ఆంజనేయులు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యాక్షులు జాలా బాలాజీ, రవి, దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.
ఏలూరు రూరల్: ఎన్టీఆర్ ఆశయాలు ఆచరణీయమని నేతల రవి అన్నారు. మల్కాపురంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. కొట్టే సుబ్బారావు, మాజీ సర్పంచ్ లుకలాపు సత్యనారాయణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పెదవేగి: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం ఎన్‌టీ.రామారావు మహనీయుడని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమ నేని ప్రభాకర్ అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతిని పుస్కరించుకుని చక్రాయగూ డెంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని చలమోలు అశోక్‌గౌడ్‌తో కలిసి, ప్రభాకర్ ఆవిష్కరించారు. తెలుగు జాతి ఔన్నత్యాన్ని ఢిల్లీ వరకూ చాటిచెప్పిన తెలుగుతేజం ఎన్టీ.రామారావు అన్నారు. పార్టీ ఆవిర్భావంతోనే ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన ఎన్టీఆర్ మున్నెన్నడూ లేనివిధంగా అనేక సంక్షేమ పధకాలను ప్రజలకు పరిచయం చేసిన మహోన్నతుడు అన్నారు. తెలుగువారు అన్నా అని ముద్దుగా పిలుచుకునే ఎన్టీఆర్ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా జీవించి ఉంటారన్నారు. బొప్పన సుధాకర్, మాదు రవికుమార్, ఆల పాటి అమరేంద్రనాధ్‌దత్, మాగంటి సురేంద్రనాఽథ్ చౌదరి, కొనకళ్ళ శివమణి, నెక్కలపూడి సురేష్‌బాబు, మేకా కనకరాజు, ఈడ్పుగంటి అనిల్, కొనకళ్ళ గంగారావు, బొకినాల రాంబాబు, ముసునూరి ప్రసాద్, షేక్ ఉర్ధండు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పెదవేగి సొసైటీ ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహానికి సర్పంచ్ తాతా శ్రీరామ్మూర్తి, తాతా సత్యనారాయణ, కంచెన మోహనరావు, యశ్వంత్, సుబ్బారావు తదితరులు నివాళులర్పించారు. విజయరాయిలో జరిగిన కార్యక్రమంలో దారిబోయిన సత్యనారాయణ, పెదర్ల రాంబాబు, రావిపాటి పిచ్చియ్య, ఈడ్పుగంటి సురేష్‌బాబు, బిర్లంగి పెద్దులు, వీరంకి నాగరాజు, మంత్రి శ్రీను, షేక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.