Share News

రూ.3 లక్షలివ్వండి.. 14 లక్షలు తీసుకెళ్లండి !

ABN , Publish Date - Dec 29 , 2023 | 12:11 AM

దొంగనోట్లు మార్చే మూఠాను పోలీసులు పట్టుకున్న ఘటన కొయ్యలగూడెం దాబా హోటల్‌ వద్ద జరిగిం ది.

రూ.3 లక్షలివ్వండి.. 14 లక్షలు తీసుకెళ్లండి !
వివరాలు వెల్లడిస్తున్న సీఐ, ఎస్‌ఐలు

రూ.3 లక్షలివ్వండి.. 14 లక్షలు తీసుకెళ్లండి !

దొంగనోట్లు మార్చే ముఠా అరెస్టు

కొయ్యలగూడెం : దొంగనోట్లు మార్చే మూఠాను పోలీసులు పట్టుకున్న ఘటన కొయ్యలగూడెం దాబా హోటల్‌ వద్ద జరిగిం ది. సీఐ విజయబాబు, ఎస్‌ఐ విష్టువర్దన్‌ తెలిపిన వివరాలివి.. కొయ్యలగూడెం దాబా వద్ద కొంతమంది వ్యక్తులు దొంగనోట్లు మారుస్తుండగా గురువారం పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వీరిలో టి.నరసాపురం, గోపాలపుంరం మండలాలకు చెందిన ఎలేటి చంద్రశేఖర్‌, దిరిశపం వెంకటేష్‌, చిట్ల నాగరాజు, మరి కొంతమంది ముఠాగా కలిశారు. ద్వారకాతిరుమల మండలానికి చెందిన ఓ వ్యక్తికి మూడు లక్షలు ఇస్తే రూ.14లక్షలు నకిలీ నోట్లు ఇస్తామని నమ్మించారు. అతడు గురువారం కొయ్యలగూడెం దాబా హోటల్‌ వద్దకు వచ్చి దొంగనోట్లు మారుస్తుండగా పోలీసులు దాడి చేసి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి రూ.13 లక్షలు 96 వేలు, (500నోట్లు), రూ.4.వేలు ఒరిజినల్‌ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసున మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Dec 29 , 2023 | 12:11 AM