నవోదయ పరీక్షకు 347 మంది

ABN , First Publish Date - 2023-02-12T00:20:02+05:30 IST

పెదవేగిలోని జవహర్‌ నవోదయ విద్యాలయం(జేఎన్వీ) తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి శనివారం నిర్వహించిన ప్రవేశపరీక్ష ప్రశాంతంగా ముగిసింది.

నవోదయ పరీక్షకు 347 మంది
పరీక్ష కేంద్రానికి వెళుతున్న విద్యార్థులు

పెదవేగి, ఫిబ్రవరి 11: పెదవేగిలోని జవహర్‌ నవోదయ విద్యాలయం(జేఎన్వీ) తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి శనివారం నిర్వహించిన ప్రవేశపరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు 725 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా 347 మంది మాత్రమే హాజరయ్యారని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వైఎస్‌ఎస్‌ చంద్రశేఖర్‌ తెలి పారు. జేఎన్వీలో 312 మందికి గానూ 155 మంది, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయంలో 168కు 78 మంది, దెందులూరు మండలం గోపన్న పాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 245 మందికి 114 మంది ప్రవేశ పరీక్ష రాశారు. కాగా 378 మంది విద్యార్ధులు గైర్హాజరయ్యారు.

Updated Date - 2023-02-12T00:20:03+05:30 IST