సైన్స్‌పై అవగాహన పెంచుకోవాలి

ABN , First Publish Date - 2023-02-28T23:54:32+05:30 IST

జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నగరంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు.

సైన్స్‌పై అవగాహన పెంచుకోవాలి
ఫత్తేపురంలో సైన్స్‌ టీచర్‌ సుబ్బరాజును సన్మానిస్తున్న గ్రామస్థులు

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ గిరిబాబు

ఘనంగా జాతీయ సైన్స్‌ డే వేడుకలు

జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నగరంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. సైన్స్‌ మేథావి సర్‌ సీవీ రామన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.

విజ్ఞానశాస్త్ర ప్రదర్శనలతో పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాలు ఆకర్షించాయి.

ఏలూరు ఎడ్యుకేషన్‌/ఏలూరు రూరల్‌, ఫిబ్రవరి 28 : సైన్స్‌పై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని కోటదిబ్బ ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ గిరిబాబు సూచించారు. కోటదిబ్బ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్‌ దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులకు క్విజ్‌ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ముఖ్యఅతిథిగా సెట్‌వెల్‌ సీఈవో మెహర్రాజ్‌ హాజరు కాగా, వైస్‌ ప్రిన్సిపాల్‌ అజయ్‌కుమార్‌, అధ్యాపకులు పాల్గొన్నారు. ఆర్‌.ఆర్‌.పేట శ్రీశర్వాణీ విద్యాప్రాంగణంలో 350కిపైగా వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. స్కూలు హెచ్‌ఎం సత్యశారద, డైరెక్టర్‌ మదనమోహ నరాజు పాల్గొన్నారు. అగ్రహారంలో శ్రీభారతి పబ్లిక్‌ స్కూలులో సైన్స్‌ డే వేడుకలను అన్నపనేని రవికుమార్‌ ప్రదర్శనలను తిలకించారు. పడమరవీధిలోని లిటిల్‌బడ్స్‌ స్కూలులో పలురకాల సైన్స్‌ నమూనాలను తయారుచేసి ప్రదర్శనకు పెట్టారు. పలు ప్రభుత్వ,ర పైవేటు పాఠశాలల బాలబాలికలకు సీఆర్‌ఆర్‌ కళాశాలలో క్విజ్‌, పోస్టర్‌ ప్రజంటేషన్‌, వ్యాసరచన, వక్తృత్వపోటీలు నిర్వహించి విజేతలకు కరస్పాండెంట్‌ డాక్టర్‌ విష్ణుమోహన్‌, ప్రిన్సిపాల్స్‌ డాక్టర్‌ రామరాజు, డాక్టర్‌ కొండయ్యరావు బహుమతులు అందజేశారు. జిల్లా సైన్స్‌ అధికారి రామారావు, ఫిజిక్స్‌ హెచ్‌వోడీ గోపాల్‌, జువాలజీ హెచ్‌వోడీ విశ్వేశ్వరరావు, ఫిషరీస్‌ హెచ్‌వోడీ శిరీష పాల్గొన్నారు. శనివారపుపేట జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాలలో పాఠశాల హెచ్‌ఎం ఎ.సర్వేశ్వరరావు అధ్యక్షతన విద్యార్థులకు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఫస్ట్‌ అసిస్టెంట్‌ రాజేశ్వరి, సైన్సు ఉపాధ్యా యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెం/చింతలపూడి/కామవరపుకోట, ఫిబ్రవరి 28 : జంగారెడ్డిగూడెం సీఎస్‌టీఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రసాద్‌బాబు సైన్స్‌ చరిత్రను విద్యార్థులకు వివరించారు. కళాశాల గణిత శాస్త్ర విభాగాధిపతి డాక్టర్‌ సీహెచ్‌ బద్రి నారాయణ ఆధ్వర్యంలో వ్యాస రచన, వక్తృత్వ, క్విజ్‌ పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. కళాశాల రసాయన శాస్త్ర అధ్యాపకుడు డాక్టర్‌ ఎం.మధు, భౌతిక శాస్త్ర విభాగాధిపతి, జి.వి.గంగాధర్‌రావు, అధ్యాపకురాలు ఆర్‌.విజయ దీపిక, తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం బాలుర ఉన్నత పాఠశాల, ప్రతిభ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌, విద్యావికాస్‌, వికాస్‌, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్లో సైన్స్‌ ప్రాజెక్ట్‌లను ప్రదర్శించారు. చింతలపూడిలో జిల్లా పరిషత్‌ బాలికల హైస్కూలులో సైన్స్‌ పరికరాల ప్రదర్శనను సీఐ ఎం.వి.ఎస్‌.మల్లేశ్వరరావు ప్రారంభించారు. హెచ్‌ఎం మాటూరి చక్రధరరావు, సైన్స్‌ టీచర్లు కె.సుజాత, నిర్మల పాల్గొన్నారు. కామవరపుకోట మండలం రావికంపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం ఉమ్మడి భీమరాజు ఆధ్వర్యంలో సైన్స్‌డే నిర్వహించారు. కామవరపుకోటలోని ప్రభుత్వ మోడల్‌ డిగ్రీ కళాశాలలో సైన్సు విభాగం ఆధ్వర్యంలో సైన్సు దినోత్సవాన్ని నిర్వహించారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రవీంద్రబాబు, అధ్యాపకులు పాల్గొన్నారు.

నిడమర్రు/ఉంగుటూరు, ఫిబ్రవరి 28 : నిడమర్రు మండలంలో ఫత్తేపురం, తోకలపల్లి, అడవికొలను ఉన్నత పాఠశాలల్లో జాతీయ సైన్స్‌ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఫత్తేపురం ఉన్నత పాఠశాల హెచ్‌ఎం టి.వి. రామకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్‌ ప్రయోగాలు అలరించాయి. ఈ సందర్భంగా నేషనల్‌ ఇంటిగ్రిటీ అవార్డు పొందిన ఫిజిక్స్‌ టీచర్‌ కె.సుబ్బరాజును ఘనంగా సత్కరించారు. తోకలపల్లి ఉన్నత పాఠశాల లో హెచ్‌ఎం సాయిబాబు, సైన్స్‌ టీచర్‌ పోతురాజుల ఆధ్వర్యంలో, అడవికొలను ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం పి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సైన్స్‌ డే వేడుకలు నిర్వహించారు. ఉంగుటూరు మండలం నారాయణపురం గీతాంజలి జూనియర్‌ కళాశాలలో తపన ఫౌండేషన్‌ సౌజన్యంతో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శరణాల మాలతీరాణి ఆధ్వర్యంలో, నారాయణపురం శ్రీఅరవింద శత జయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్‌ డే వేడుకలు నిర్వహించారు.

పెదవేగి, ఫిబ్రవరి 28 : పినకడిమి జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాలలో సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో భాగంగా ప్రయోగాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సర్వశిక్ష అభియాన్‌ సీఎంవో జె.రవీంద్ర, జిల్లా పరీక్షల విభాగం కార్యదర్శి ఏ.సర్వేశ్వరరావు, పాఠశాల హెచ్‌ఎం టి.ప్రభాకర్‌, ఉపాధ్యాయులు విద్యా ర్థులను అభినందించారు. పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు.

టి.నరసాపురం, ఫిబ్రవరి 28 : స్థానిక విజన్‌ యూపీ స్కూల్లో పాఠశాల కరస్పాండెంట్‌ పురం శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జాతీయ విజ్ఞాన శాస్త్ర వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎంఈవో టి.రామ్మూర్తి సీవీ రామన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Updated Date - 2023-02-28T23:54:32+05:30 IST