నారాయణస్వామికి వీడ్కోలు

ABN , First Publish Date - 2023-03-31T00:22:23+05:30 IST

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి యర్రా నారాయ ణస్వామి అంత్యక్రియలు గురువారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.

నారాయణస్వామికి వీడ్కోలు

నివాళులర్పించిన పార్టీల నేతలు

ఉండి, మార్చి 30 : టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి యర్రా నారాయ ణస్వామి అంత్యక్రియలు గురువారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ఉండి మండలం ఉప్పులూరులో నారాయణస్వామి భౌతికకాయానికి అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు పూల మాలలు వేసి నివాళులర్పించారు. రాజకీయాల్లో ఇప్పటి తరం నాయకులకు నారాయణస్వామి ఒక దిక్సూచివం టి వారని దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి, రైతులకు తీరని లోటని మాజీ మంత్రులు ప్రత్తి పాటి పుల్లారావు, నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎంపీలు కొనగళ్ల నారాయ ణ అన్నారు. సర్పంచ్‌స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, జడ్పీ చైర్మన్‌గా, తాడిపూడి, కొవ్వాడ, పోలవరం ప్రాజెక్టుల సాధన కోసం విశేష కృషి చేసిన వ్యక్తిగా నారాయణస్వామి చరిత్రలో నిలిచిపోతారని టీడీపీ పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల అధ్యక్షులు తోట సీతారామలక్ష్మి, గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యేలు రామానాయుడు, రామరాజు కొనియాడారు. పుప్పాల వాసుబాబు, మాజీ ఎమ్మెల్యేలు వేటుకూరి శివరామరాజు, చింతమ నేని ప్రభాకర్‌, బండారు మాధవనాయుడు, జడ్పీ మాజీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాద్‌, డీసీసీబీ చైర్మన్‌ పీవీఎల్‌ నరసింహ రాజు తదితరులు నారాయణస్వామి సేవలను ప్రస్తుతించారు. నారాయణ స్వామి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ఆయన సొంత గ్రీన్‌ ల్యాండ్‌ లో నిర్వహించారు. పోలీసులు గౌరవ వందనం చేశారు. గాలిలో మూడు సార్లు కాల్పులు జరిపారు. ఊరేగింపులో పెద్ద సంఖ్యలో బంధువులు, స్నేహి తులు, సన్నిహితులు, గ్రామస్తులు కడసారి వీడ్కోలు పలికారు. ఆయనకు కుమారుడు నవీన్‌ దహన సంస్కారాలు చేశారు.

Updated Date - 2023-03-31T00:24:34+05:30 IST