సమ్మె సైరన్
ABN , Publish Date - Dec 26 , 2023 | 12:34 AM
మునిసి పల్ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలోనూ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసెంబ్లీలోనూ జగన్ ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చక పోవడంతో కార్మికులు ఆగ్రహంతో ఉన్నారు.
ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకుంటామని స్పష్టీకరణ
ఏలూరు టూటౌన్, డిసెంబరు 25 : మునిసి పల్ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలోనూ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసెంబ్లీలోనూ జగన్ ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చక పోవడంతో కార్మికులు ఆగ్రహంతో ఉన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో అమీ తుమీ తేల్చుకుంటామని కార్మికులు నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మున్సిపల్ కార్మికుల సమస్యల న్నింటిని పరిష్కరిస్తామని జగన్ హామీ ఇచ్చా రు. గత నాలుగున్నరేళ్లుగా ఏ ఒక్క హామీ నెర వేర్చలేదు. సమస్యలు పరిష్కరించాలని కార్మి కులు ఽమునిసిపల్ ఆఫీసుల ముందు ధర్నాలు, నిరాహార దీక్షలు, కలెక్టరేట్ వద్ద నిరసనలు, రిలే నిరాహార దీక్షలు, డీఎంఏ ఆఫీసు ముట్టడి ఇలా పలు రకాలుగా కార్మికులు ఆందోళనలు చేసినా ప్రభుత్వానికి చీమకుట్టిన్నట్టు లేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సీఐటీయూ) ఆధ్వ ర్యంలో సమ్మెకు వెళ్తున్నారు.
జిల్లాలో ఏలూరు కార్పొరేషన్, నూజివీడు, జంగారెడ్డిగూడెం మునిసిపాలిటీలతో పాటు చిం తలపూడి, నగర పంచాయతీలో 1,670 మంది కార్మికులు ఉన్నారు. వీరిలో 500 మంది పర్మి నెంట్ ఉద్యోగులు ఉండగా, 1100 మంది కాం ట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఆప్కాస్ కార్మికులు ఉన్నారు. గత నాలుగున్నర ఏళ్లలో ఒక్కో కాం ట్రాక్టు ఉద్యోగికి రూ. 3.18 లక్షలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. పర్మినెంట్ కార్మికులు రూ.2 లక్షలు నష్టపోయారు. కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ లాంటి చిన్నచిన్న ఉద్యోగులు లక్షలాది రూపాయలు నష్టపోతే వారి కుటుంబాలు ఎలా గడుస్తాయనేది కార్మికుల ఆవేదన. తప్పనిసరి పరిస్థితుల్లో పారిశుధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెలోకి వెళ్తున్నారు.
జగన్ వల్ల కార్మికులు నష్టపోయారు
జగన్ సీఎం అయిన తర్వాత కార్మికులకు తీరని నష్టం ఏర్పడింది. ఇంజనీరింగ్, పారిశుధ్య కార్మికులకు పీఆర్సీలో కోత విధించారు. హెల్త్, రిస్క్ అలవెన్సులు లేవు. కాంట్రాక్టు కార్మికులను సంక్షేమ పథకాలకు అనర్హులను చేశారు. ఇది చాలా అన్యాయం. ఒక కార్మికుడు లక్షలాది రూపాయలు కోల్పోవడం అంటే ఎంతో దారుణ మైన విషయం. ప్రభుత్వం సమస్యలు పరిష్క రించే వరకు సమ్మె ఆపే ప్రసక్తి లేదు.
– సోమయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు
ఇవీ డిమాండ్లు
కాంట్రాక్టు అవుట్‌సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి
సమాన పనికి సమాన వేతనం,కార్మికులకు రిస్క్, హెల్త్ అలవెన్సులు ఇవ్వాలి
క్లాప్ ఆటోడ్రైవర్లకు రూ.18500 కనీసవేతనాలు ఇవ్వాలి
రిటైర్మ్‌ంట్ బెనిఫిట్స్, గ్రాడ్యూటీ, సగం జీతం పింఛన్ ఇవ్వాలి
పర్మినెంట్ సిబ్బందికి సీపీఎస్ రద్దు చేయాలి
పాత పింఛన్ విధానం అమలు చేయాలి
విలీన పంచాయతీ కార్మికులకు ఆప్కాస్ నుంచి జీతాలు ఇవ్వాలి.