ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణపై పార్లమెంట్‌లో చట్టం చేయాలి

ABN , First Publish Date - 2023-03-05T23:16:23+05:30 IST

ఎస్పీ రిజర్వేషన్‌ వర్గీకరణపై పార్లమెంట్‌లో చట్టం చేయాలని ఎమ్మార్పీఎస్‌ నాయకుడు మున్నంగి నాగరాజు అన్నారు.

ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణపై పార్లమెంట్‌లో చట్టం చేయాలి
అంబేడ్కర్‌కు నివాళులర్పిస్తున్న ఎంఆర్‌పీఎస్‌ నాయకులు

పెదవేగి, మార్చి 5: ఎస్పీ రిజర్వేషన్‌ వర్గీకరణపై పార్లమెంట్‌లో చట్టం చేయాలని ఎమ్మార్పీఎస్‌ నాయకుడు మున్నంగి నాగరాజు అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఎమ్మార్పీఎస్‌ చేపట్టిన సంగ్రామ పాదయాత్ర ఆదవారం పెదవేగి మండలం నాగన్నగూడెం నుంచి ఏలూరుకు బయలుదేరింది. నాగరాజు మాట్లాడుతూ వర్గీకరణకోసం ఎమ్మార్పీఎస్‌ దశాబ్దాలుగా పోరా టం చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నా యన్నారు. పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎస్సీ వర్గీకరణ సాధించి తీరతామన్నారు. రాజకీయ పార్టీలు ఎస్సీలను ఓటు బ్యాంకులుగా ఉపయోగించుకుంటున్నాయే తప్ప ఎస్సీలకు ఉపయోగ పడింది లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మార్పీఎస్‌ నాయకులు తనగాల శేఖర్‌, కొత్తపల్లి మురళీకృష్ణ, మద్దాల తిరుపతిరావు, జొన్నకూటి జాన్‌, యర్రా రఘు, మద్దాల మిఖాయేలు, చొదిమెళ్ళ ప్రసాద్‌, వీరయ్య పాల్గొన్నారు.

దెందులూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ రిర్వేషన్‌ వర్గీకరణ చేసి మాట నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్‌ నాయకుడు మున్నంగి నాగరాజు డిమాండ్‌ చేశారు. మాదిగ సంగ్రామ యాత్ర ఆదివారం గంగన్నగూడెం చేరుకుంది. గాలాయగూడెం, గోపన్నపాలెం, మసీదుపాడు, సోమవరప్పాడు మీదుగా ఏలూరు చేరుకుంది. కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి నాయకులు. సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T23:16:23+05:30 IST