రైతు భరోసా కాదు.. రైతు భక్షక కేంద్రాలు: ఎమ్మెల్యే నిమ్మల

ABN , First Publish Date - 2023-04-03T23:38:33+05:30 IST

రైతు భరోసా కేంద్రాలు కావవి.. రైతు భక్షక కేం ద్రాలు అని ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

రైతు భరోసా కాదు.. రైతు భక్షక కేంద్రాలు: ఎమ్మెల్యే నిమ్మల
కలగంపూడిలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే నిమ్మల

యలమంచిలి, ఏప్రిల్‌ 3: రైతు భరోసా కేంద్రాలు కావవి.. రైతు భక్షక కేం ద్రాలు అని ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కలగంపూ డిలో సోమవారం నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానుయుడు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిని నమో దు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు దాళ్వా వరి కోతలు మొదలుపెట్టారని, ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిందని విమర్శించారు. పేరుకే రైతు భరోసా కేంద్రాలని.. ఇంతవరకు ఒక్క గింజ ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతు భక్షక కేంద్రాలుగా మారయని ఎద్దేవా చేశారు. రైతుభరోసా కేంద్రాల్లో యూరి యా, ఎరువులు లేకపోవడంతో రైతులు బ్లాక్‌ మార్కెట్లో ఎరువులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం రైతులకు కల్పించిందన్నారు.

Updated Date - 2023-04-03T23:38:33+05:30 IST