రైతులకు అండా దండ.. చంద్రబాబే

ABN , First Publish Date - 2023-06-03T00:34:10+05:30 IST

నాలుగేళ్ల నుంచి రైతులు అప్పులపాలై అష్టకష్టాలు పడుతున్నా ప్రభుత్వం రైతులను ఆదుకున్న దాఖలాలు లేవని రానున్న రోజుల్లో చంద్రబాబునాయుడే రైతులకు అండా దండా అని పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు అన్నారు.

 రైతులకు అండా దండ.. చంద్రబాబే
పోడూరు మండలం పెనుమదం వద్ద వరి పొలాల్లో ర్యాలీచేస్తున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, రైతులు

పోడూరు, జూన్‌ 2 : నాలుగేళ్ల నుంచి రైతులు అప్పులపాలై అష్టకష్టాలు పడుతున్నా ప్రభుత్వం రైతులను ఆదుకున్న దాఖలాలు లేవని రానున్న రోజుల్లో చంద్రబాబునాయుడే రైతులకు అండా దండా అని పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు అన్నారు. పోడూరు మండలం పెనుమదంలో రైతులతో కలిసి ఆయన శుక్రవారం చంద్రబాబు చిత్రపటానికి ధాన్యాభిషేకం చేశారు. పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి మెయిన్‌రోడ్డు నుంచి రెండు కిలోమీటర్లు మేర వరిచేలల్లో ప్రదర్శనగా వెళ్లారు. మినీ మేనిఫెస్టోలో రైతులకు ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం ప్రకటనపై చంద్రబాబుకు జై.. జై అంటూ రైతులు నినాదాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎప్పుడూ లేని విధంగా రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేని దుస్థితి దాపురించిందన్నారు. సర్పంచ్‌ తానేటి బాబూరావు, జిల్లా టీడీపీ తెలుగురైతు కమిటీ చెర్మన్‌ పాతూరి రామప్రసాద్‌చౌదరి, కార్యదర్శి రాచకొండ విశ్వనాఽథం, మండల టీడీపీ అధ్యక్షుడు గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, మైగాపుల శ్రీనివాసరావు, పెన్మెత్స రామభద్రరాజు, కడలి ఆంజనేయులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

తణుకు : రాష్ట్ర ప్రజలు భవిష్యత్‌కు గ్యారెంటీ కల్పించేది చంద్రబాబునాయుడు మాత్రమే అని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం నరేంద్ర సెంటర్‌లో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మహానాడులో ప్రకటించిన మినీ మేనిపోస్టు ప్రజలకు భరోసా కల్పించేలా ఉందని చెప్పారు. సంక్షేమ పథకాలతో పాటు మహిళలకు, యువతకు, రైతులకు, బీసీలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చినందుకు పాలాభిషేకం చేశామన్నారు. దొమ్మేటి వెంకట సుధాకర్‌, బసవా రామకృష్ణ, గోపిశెట్టి రామకృష్ణ, పితాని మోహన్‌, ఒమ్మి రాంబాబు, గుబ్బల శ్రీనివాసు, తమరాపు రమనమ్మ, ఇందిరాదేవి, తణుకు రేవతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:34:10+05:30 IST