మహానాడు విజయవంతం చేయాలి : మెంటే

ABN , First Publish Date - 2023-05-27T00:16:22+05:30 IST

మహానాడును విజయవంతం చేసేందుకు కైకలూరు నియోజకవర్గం నుంచి నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు మెంటే పార్థసారథి అన్నారు.

మహానాడు విజయవంతం చేయాలి : మెంటే

కైకలూరు, మే 26: మహానాడును విజయవంతం చేసేందుకు కైకలూరు నియోజకవర్గం నుంచి నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు మెంటే పార్థసారథి అన్నారు. శుక్రవారం కైకలూ రులో మాగంటి బాబు ఇంటి వద్ద నిర్వహించిన పార్టీ సమన్వయ కమిటీ సమా వేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 27, 28 తేదీల్లో రాజ మహేంద్రవరంలో మహానాడు నిర్వహిస్తున్నారని, 27న ముఖ్య నాయకులతో సమావేశం, 28న భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 15 లక్షల మంది కార్యక్రమానికి హాజరవుతారని అన్నారు. కైకలూరు నియోజక వర్గంలోని నాలుగు మండలాల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో మహానాడు కార్యక్ర మానికి పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు తరలిరావాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగబాబు, పార్టీ మండల అధ్యక్షులు పెన్మెత్స త్రినాథ్‌రాజు, నారగాని నాగేశ్వరరావు, జడ్పీటీసీ మాజీ సభ్యులు విజయ లక్ష్మి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ బాబు, వల్లభనేని శ్రీనివాస చౌదరి, మహిళా నాయకురాలు లక్ష్మీరాణి, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీ జానీ, పార్టీ జిల్లా నాయకులు కెకెబాబు, పార్టీ నాయకులు వేములపల్లి కారుణ్య, తేరా రమేష్‌, ఈదా వెంకటస్వామి, వీరాబత్తిన సుధ, వాసిపల్లి సతీష్‌కన్నా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-27T00:16:22+05:30 IST