ప్రజా సంక్షేమానికి టీడీపీ అధిక ప్రాధాన్యం

ABN , First Publish Date - 2023-06-02T23:42:21+05:30 IST

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జయ్యవరపు శ్రీరామమూర్తి తెలిపారు.

ప్రజా సంక్షేమానికి టీడీపీ అధిక ప్రాధాన్యం
రాజుపోతేపల్లిలో చంద్రబాబు చిత్రపటానికి పాలభిషేకం

చంద్రబాబు చిత్రపటానికి పాలభిషేకం చేసిన టీడీపీ నేతలు

టి.నరసాపురం, జూన్‌ 2: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జయ్యవరపు శ్రీరామమూర్తి తెలిపారు. మహానాడులో చంద్ర బాబు సంక్షేమ పథకాలు ప్రకటించిన నేపథ్యంలో రాజుపోతేపల్లిలో చంద్ర బాబు చిత్రపటానికి శుక్రవారం పాలభిషేకం చేశారు. బీసీలకు రక్షణ చట్టం, 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి నెలా రూ.1500, దీపం పథకం ద్వారా మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం, మహిళలకు జిల్లా పరిధిలో ఉచిత బస్సు సౌకర్యం, విద్యార్థులకు ఏడాదికి రూ.15వేలు, వ్యవసాయ పెట్టుబడులకు ఏడాదికి రూ.20వేలు, యువగళం ద్వారా నిరుద్యోగం యువతకు నెలకు రూ.3వేలు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. నాయుడు రామకృష్ణా రావు గౌడ్‌, నల్లూరి వెంకట చలపతి రావు, కొండపల్లి రవి, ఆచంట అనిల్‌, పెద్దిన సత్యనారాయణ, బొంతు వెంకట శ్రీనివాసరావు పాల్గొన్నారు.

కామవరపుకోట: మహానాడు సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీ య అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టో అంద రికీ ఆమోదయోగ్యమని, ముఖ్యంగా బీసీలకు, మహిళలకు, నిరుద్యోగులకు చేయూతనిచ్చేలా ఉందని కోనేరు సుబ్బారావు, మద్దిపోటి నాగేశ్వర రాంబా బు అన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యాం సుందర్‌ శేషు ఆధ్వర్యంలో శుక్రవారం చంద్రబాబు చిత్రపటానికి టీడీపీ శ్రేణులు పాలభి షేకం చేశారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాల్లో విజ యం సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యకర్తలు, నాయకులు మేనిఫెస్టోను ఇంటింటికి ప్రతీ ఓటరుకు అర్ధమయ్యేవిధంగా ప్రచారం చేయా లన్నారు. నెక్కలపు సూర్యనారాయణ, నూతి రాటాలు, నెక్కలపు గంగాధర రావు, రేగుంట సురేష్‌, నల్లూరి సత్తిబాబు, నాగరాజు, జయకృష్ణ, నన్నా హరి శ్చంద్ర, నిమ్మల సత్యనారాయణ, లక్కోజు త్రిమూర్తులు, వెలుగు దుర్మి, పిల్లలమర్రి వెంకటేశ్వరరావు, చవల శ్రీను, బందెల కిషోర్‌, నల్లమిల్లి సుధా కరరావు, కస్సే ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T23:42:21+05:30 IST