విద్యుదాఘాతంతో న్యాయవాది మృతి
ABN , First Publish Date - 2023-02-12T00:42:31+05:30 IST
విద్యుదాఘాతంతో న్యాయవాది మృతి చెందిన దుర్ఘటన నూజివీడు పట్టణంలో చోటుచేసుకుంది.
నూజివీడు టౌన్, ఫిబ్రవరి 11: విద్యుదాఘాతంతో న్యాయవాది మృతి చెందిన దుర్ఘటన నూజివీడు పట్టణంలో చోటుచేసుకుంది. నూజివీడు పట్టణానికి చెందిన పేర్ల రామలింగేశ్వరరావు అలియాస్ రాము (47) ఎంప్లాయిస్ కాలనీలో ఇల్లు నిర్మిస్తున్నారు. ఇంటికి క్యూరింగ్ చేసేందుకు వెళ్ళిన ఆయన క్యూరింగ్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రముఖ న్యాయవాదిగా, వాసవీ క్లబ్ సభ్యుడిగా మృదు స్వభావిగా పేరుగాంచిన రామలింగేశ్వరరావు మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు. నూజివీడు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.