బాదుడుకు సిద్ధం

ABN , First Publish Date - 2023-05-31T23:55:32+05:30 IST

ప్రభుత్వం బాదుడుకు సిద్ధమైంది. భూముల రిజిస్ర్టేషన్‌ ధరలను పెంచేందుకు ఆదేశాలు జారీచేసింది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలకు జిల్లా కమిటీ ఇదివరకే ఆమోద ముద్ర వేసింది.

బాదుడుకు సిద్ధం

జిల్లాలో భూముల ధరల పెంపునకు ఆమోదం

నేటినుంచి కొత్త ధరలు అమల్లోకి

కనిష్టం 20 శాతం..

గరిష్టంగా 30 శాతం

ప్రధాన పట్టణాల్లో గజం కనిష్ట విలువ రూ. 10 వేలు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వం బాదుడుకు సిద్ధమైంది. భూముల రిజిస్ర్టేషన్‌ ధరలను పెంచేందుకు ఆదేశాలు జారీచేసింది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలకు జిల్లా కమిటీ ఇదివరకే ఆమోద ముద్ర వేసింది. కొత్త ధరలు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో నమోదు చేసి ఉంచాలని బుధవారం సాయంత్రానికి జిల్లా రిజిస్ర్టార్‌లకు వర్తమానం అందింది. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడమే తరువాయి జూన్‌ ఒకటో తేదీ నుంచే కొత్త ధరలు అమలు చేసేలా చర్యలు తీసుకున్నారు. వాస్తవానికి పెంపు విషయమై ప్రభుత్వం ఎప్పటినుంచో కృతనిశ్చయంతో ఉంది. ప్రజలందరి నుంచి వ్యతిరేకత రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చింది. సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాల యాల పరిధిలో అవకాశం ఉన్న గ్రామాలు, ప్రాంతాల్లో మాత్రమే పెంపుదల చేయాలని దిశానిర్దేశం చేసింది. ఆ మేరకు ప్రతిపాదనలు రూపొందించారు. ప్రతి కార్యాలయ పరిధిలోనూ కనిష్టంగా 20 శాతం పెంచారు. గరిష్ట ధరను 30 శాతానికి పెంచి ప్రతి పాదనలు రూపొందించారు. ప్రతిపాదనలకు జిల్లా స్థాయిలో ఆమోదముద్ర పడింది. ప్రభుత్వం చివరి దశలో తగ్గితే తప్ప జూన్‌ ఒకటో తేదీ నుంచే కొత్త ధరలు అమలులోకి రానున్నాయి.

కనిష్ట ధర రూ. 10 వేలు

కొత్త ధరల ప్రకారం పట్టణాల్లో గజం స్థలం కనిష్ట విలువ రూ. 10 వేలకు చేరనుంది. ఆ జాబితాలో జిల్లాలోని భీమవరం, తాడేపల్లి గూడెం, తణుకు, పాలకొల్లు పరిధిలోని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఇప్పటి వరకు గజం స్థలానికి సంబంధించి కనిష్ట ధర రూ.7000 వరకు ఉంది. దానిపై మరో రూ.3000 పెంచేశారు. ప్రభుత్వ ఒత్తిడితోనే క్షేత్రస్థాయిలో అధికారులు స్పందించారు. ధరలు పెంపులో ముందడుగు వేశారు. ప్రస్తుత ధరల పెంపుపైనా ప్రభుత్వ స్థాయిలో ఇంకా సంతృప్తి లేదని సమా చారం. వీలైనంత అధికంగా ధరలను పెంచాలంటూ సూచించారు. ఇప్పటికే రిజిస్ర్టేషన్‌లు మందగించాయి. లక్ష్యాలను చేరుకోవడం కష్టతర మవుతోంది. సమీక్షల్లో చీవాట్లు తినాల్సి వస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ధరలు పెంచితే రిజిస్ర్టేషన్‌లు మరింత తగ్గే ప్రమాదం ఉందంటూ క్షేత్ర స్థాయిలో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.ప్రభుత్వ ఎంతగా ఒత్తిడి తెచ్చినప్పటికీ 30 శాతానికి మించి పెంచలేదు. ఇంతటి స్థాయిలో పెంచడమే చాలా ఎక్కువని సిబ్బంది భావిస్తున్నారు.

సొమ్ములున్న ప్రాంతాలపై కన్ను

జిల్లాలో పట్టణ పరిధిలో ఉన్న సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాల యాల్లో పరిసర గ్రామాలతో పాటు, వార్డుల్లోనూ పెంచారు. గత ఏడాది ఏప్రిల్‌లోనే జిల్లా కేంద్రమైన భీమవరంలో 20 శాతం ధరలు పెంచేశారు. ఆ తర్వాత అన్ని ప్రాంతాల్లోనూ నిర్మాణాల రిజిస్ర్టేషన్‌ విలువను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా మరోసారి ఆర్థిక సమృద్ధి ఎక్కు వగా ఉన్న ప్రాంతాలపై ప్రభుత్వం కన్ను పడింది. దాంతో పట్టణాల చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ధరలు పెరిగాయి. అదే మండల కేంద్రాల్లో ఉన్న సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల పరిధిలో మేజర్‌ పంచాయతీలను పరగణలోకి తీసుకున్నారు. ధరలు పెంచుతూ ప్రతిపాదనలు తయారు చేశారు. మొత్తం పైన రిజిస్ర్టేషన్‌లు అధికంగా జరిగే ప్రాంతాల్లో పెంపుదలకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. విద్యుత్‌ చార్జీలు, ఆర్టీసీ చార్జీలను ఇది వరకే బాదేసింది. హరితపన్ను (గ్రీన్‌ట్యాక్స్‌) పేరుతో రవాణా రంగంపై పడింది. తొలినుంచి మద్యం ధర లను పెంచేసి ప్రభుత్వం సొమ్ము చేసుకుంటోంది. అన్ని రాష్ర్టాల కంటే ఇక్కడే పెట్రోలు, డీజల్‌ ధరలు అధికంగా ఉన్నాయి. ఇన్ని రకాల బాదుడు చాలదన్నట్టు రిజిస్ర్టేషన్‌ విలువపై పడింది.

దీపం ఉండగానే..

ధరల పెంపులోనూ అధికార పార్టీ నేతలు చక్రం తిప్పారు. తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతంలో ధరలను పెంచేసు కున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం భూసేకరణ నిర్వహిస్తే అధిక ధర పలుకుతుందన్న ఉద్దేశంతో వ్యవసాయ భూము లను నివాసయోగంగా మార్చారు. సెంట్లలో కొనుగోలు చేసిన స్థలాన్ని గజాల్లోకి మార్చారు. దీనివల్ల భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది. భూసేకరణ చేస్తే పట్టణ ప్రాంతంలో అయితే రెండింతలు ధర లభిస్తుంది. ఇలా ముందుచూపుతో అధికార పార్టీ నేతలు పంట పొలాల్లో గజం స్థలాన్ని రూ. 10 వేల వరకు ఉండేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అధి కారంలో ఉండగానే తమ సొంత భూముల రిజిస్ర్టేషన్‌ ధరను పెంచేలా చేసిన ప్రయత్నాలు ఫలవంతమయ్యాయి.

రిజిస్ర్టేషన్‌ కార్యాలయాలు కిటకిట

ప్రభుత్వం ధరలు పెంచేందుకు సిద్ధం కావ డంతో బుధవారం సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాల యాలు కిటకిటలాడాయి. జిల్లాలోని 15 కార్యాల యాల్లోనూ లక్ష్యానికి మించి దస్తావేజులు నమోద య్యాయి. ఒకవైపు మంచిరోజు కావడం కలసి వచ్చింది. దానికి తోడు రెండు రోజులపాటు సర్వర్‌ పని చేయలేదు. ఫలితంగా మంగళవారం ఒకేసారి తాకిడి ఎక్కు వైంది. జిల్లాలో ఒకే రోజు దాదాపు రూ.2.50 కోట్లు ఆదాయం లభించింది.

Updated Date - 2023-05-31T23:55:32+05:30 IST